Rajinikanth 170th Film: సూర్య డైరెక్ట‌ర్‌తో ర‌జ‌నీకాంత్ మూవీ - 170వ సినిమా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది -rajinikanth to team up with jai bhim director tj gnanavel for 170th film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajinikanth To Team Up With Jai Bhim Director Tj Gnanavel For 170th Film

Rajinikanth 170th Film: సూర్య డైరెక్ట‌ర్‌తో ర‌జ‌నీకాంత్ మూవీ - 170వ సినిమా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది

Nelki Naresh Kumar HT Telugu
Mar 02, 2023 12:02 PM IST

Rajinikanth 170th Film: ర‌జ‌నీకాంత్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వ‌చ్చేసింది. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేల్‌తో సూప‌స్టార్ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గురువారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

ర‌జ‌నీకాంత్‌, సుభాస్క‌ర‌న్‌
ర‌జ‌నీకాంత్‌, సుభాస్క‌ర‌న్‌

Rajinikanth 170th Film: ర‌జ‌నీకాంత్ 170వ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ ఇచ్చేశారు. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేల్‌తో ర‌జ‌నీకాంత్ సినిమా చేయ‌బోతున్నాడు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని గురువారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌ని, 2024లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

సూర్య హీరోగా రూపొందిన జైభీమ్ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప‌లు అవార్డుల‌ను అందుకున్న‌ది. స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాల‌కు న్యాయం విష‌యంలో ఎదుర‌వుతోన్న అస‌మాన‌త‌ల్ని వాస్త‌విక కోణంలో ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. జైభీమ్ త‌ర‌హాలోనే సామాజిక స‌మ‌స్య‌ను చ‌ర్చిస్తూ ర‌జ‌నీకాంత్ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం జైల‌ర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ర‌జ‌నీకాంత్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్