Urvasivo Rakshasivo OTT Release Date: ఊర్వ‌శివో రాక్ష‌సివో ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పేశారు -స్ట్రీమింగ్ ఎప్పుడంటే-allu sirish urvasivo rakshasivo ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Sirish Urvasivo Rakshasivo Ott Release Date Locked

Urvasivo Rakshasivo OTT Release Date: ఊర్వ‌శివో రాక్ష‌సివో ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పేశారు -స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Nelki Naresh Kumar HT Telugu
Dec 02, 2022 11:44 AM IST

Urvasivo Rakshasivo OTT Release Date: అల్లు శిరీష్ హీరోగా న‌టించిన ఊర్వ‌శివో రాక్ష‌సివో ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌
అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌

Urvasivo Rakshasivo OTT Release Date: అల్లు శిరీష్ హీరోగా న‌టించిన ఊర్వ‌శివో రాక్ష‌సివో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. డిసెంబ‌ర్ 9న ఈ సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్న‌ది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబ‌ర్ 9 నుంచి ఆహా ఓటీటీతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో అల్లు శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించింది. సునీల్‌, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఊర్వ‌శివో రాక్ష‌సివో క‌థేమిటంటే...

భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన ఓ ప్రేమ జంట క‌థ ఇది. ప్రేమ‌, పెళ్లి ప‌ట్ల న‌మ్మ‌కం క‌లిగిన యువ‌కుడిగా అల్లు శిరీష్ న‌టించాడు. పెళ్లి త‌న ల‌క్ష్యానికి అడ్డుగా భావిస్తూ లివింగ్ రిలేష‌న్‌కు ప్రాధాన్య‌మిచ్చే యువ‌తిగా అను ఇమ్మాన్యుయేల్ క‌నిపించింది. వీరిద్ద‌రి ప్రేమ‌క‌థ‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఆద్యంతం వినోదాత్మంగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఆవిష్క‌రించారు.

న‌వంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టింది. బాక్సాఫీస్ పోటీ కార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా మాత్రం నిల‌వ‌లేక‌పోయింది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ప్యార్ ప్రేమ కాద‌ల్ సినిమ ఆధారంగా ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాను తెర‌కెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా న‌టించిన సినిమా ఇది.

IPL_Entry_Point