Chor Nikal Ke Bhaga: వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డునే బ్రేక్ చేసిన చోర్ నికల్ కే భాగా.. అసలేంటీ మూవీ?-chor nikal ke bhaga movie breaks rrr record in netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Chor Nikal Ke Bhaga Movie Breaks Rrr Record In Netflix

Chor Nikal Ke Bhaga: వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డునే బ్రేక్ చేసిన చోర్ నికల్ కే భాగా.. అసలేంటీ మూవీ?

చోర్ నికల్ కే భాగా మూవీలో యామీ గౌతమ్
చోర్ నికల్ కే భాగా మూవీలో యామీ గౌతమ్

Chor Nikal Ke Bhaga: వావ్.. ఆర్ఆర్ఆర్ రికార్డునే బ్రేక్ చేసింది చోర్ నికల్ కే భాగా మూవీ. యామీ గౌతమ్ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో సంచలనాలు సృష్టిస్తోంది.

Chor Nikal Ke Bhaga: చోర్ నికల్ కే భాగా (Chor Nikal Ke Bhaga).. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో నయా సెన్సేషన్ ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా 61 దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్ టైటిల్స్ లో ఒకటిగా ఉందంటే ఈ సినిమా ఎంతటి బజ్ క్రియేట్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డును కూడా ఈ సినిమా బ్రేక్ చేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన రెండు వారాల్లోనే అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. మ్యాడక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ అయిన ఈ చోర్ నికల్ కే భాగాలో యామీ గౌతమ్ నటించింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ లో రెండోస్థానంలో నిలిచిందీ సినిమా.

ఈ చోర్ నికల్ కే భాగా మూవీ సక్సెస్ తో అటు యామీ గౌతమ్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్టులో యామీ రెండోస్థానంలో నిలవడం విశేషం. ఇన్నాళ్లూ ఆర్ఆర్ఆర్ మూవీ పేరు మీదున్న 2.55 కోట్ల వ్యూయర్‌షిప్ గంటల రికార్డును ఈ చోర్ నికల్ కే భాగా బ్రేక్ చేసింది. గంగూబాయి కఠియావాడీ 2.21 కోట్ల వ్యూయర్‌షిప్ గంటలతో మూడోస్థానానికి పడిపోయింది.

ఈ సినిమాలో యామీ గౌతమ్ ఓ ఫ్లైట్ అటెండెంట్ గా నటించింది. ఆమెతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్, ఇతర ప్రయాణికులు హైజాక్ కు గురై, ఎలా ప్రాణాలతో బయటపడ్డారన్నదే ఈ మూవీ. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ లో మిమి, దస్వీ మూవీస్ తో సక్సెస్ సాధించిన మ్యాడక్ ఫిల్మ్స్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టింది.

థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చోర్ నికల్ కే భాగా సినిమా చాలా బాగా నచ్చుతుంది. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ఓ మస్ట్ వాచ్ గా మారిపోయింది. అజయ్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. దినేష్ విజన్, అమర్ కౌషిక్ ప్రొడ్యూస్ చేశారు.