Yami Gautam about Privacy: ఫొటో కోసం వచ్చి వీడియో తీశాడు.. సెలబ్రెటీల ప్రైవసీపై యామీ సీరియస్-yami gautam recalls young boy recording her video in hometown without consent ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yami Gautam About Privacy: ఫొటో కోసం వచ్చి వీడియో తీశాడు.. సెలబ్రెటీల ప్రైవసీపై యామీ సీరియస్

Yami Gautam about Privacy: ఫొటో కోసం వచ్చి వీడియో తీశాడు.. సెలబ్రెటీల ప్రైవసీపై యామీ సీరియస్

Maragani Govardhan HT Telugu
Feb 28, 2023 08:55 AM IST

Yami Gautam about Privacy: బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించింది. ఓ యువకుడు తనతో ఫొటో కోసం వచ్చి వీడియో తీసినట్లు తెలిపింది.

యామీ గౌతమ్
యామీ గౌతమ్ (HT_PRINT)

Yami Gautam about Privacy: సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చాలా మంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అయితే కొన్నిసార్లు మితీమీరిన ఉత్సాహం వల్ల వారి ప్రైవసీ దెబ్బతింటుంది. ఎంత పెద్ద సెలబ్రెటీలైనా వారికంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. దాంట్లోకి తొంగిచూడటాన్ని అస్సలు ఇష్టపడరు. కొంతమంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల అభిమాన నటీ, నటులకు ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నట్లు చెప్పింది. తన అనుమతి లేకుండా తన వీడియోను ఓ వ్యక్తి తీశాడంటూ తెలిపింది. ఫొటో కోసం వచ్చి ఈ విధంగా ప్రవర్తించడం తనకు అస్సలు నచ్చలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్పష్టం చేసింది.

"ఈ రోజుల్లో వీడియో ఎప్పుడు, ఎలాగైనా తీస్తున్నారు. అది ఎలాంటి అనుమతి లేకుండానే. నేను గతేడాది హిమాచల్ ప్రదేశ్‌లోని హోంటౌన్‌కు వెళ్లినప్పుడు ఓ టీనేజ్ యువకుడు వచ్చాడు. అతడి 19-20 ఏళ్లు ఉంటాయి. నా స్టాఫ్ వద్ద పర్మిషన్ తీసుకుని నాతో ఫొటో కోసం వచ్చాడు. నేను ఓపెన్‌గా ఉండి అతడితో కలిసి ఫొటో దిగాను. అది చిన్న టౌన్ కాబట్టి ప్రజలు అలా వచ్చి మాట్లాడటం, చూడటం సహజమే. అందుకు నాకు కూడా సంతోషంగానే అనిపించింది. కానీ అతడు ఫొటో కోసం వచ్చి వీడియో తీశాడు. అది చాలా బ్యాడ్ వీడియో. అది అతడు సోషల్ మీడియాలో షేర్ చేసి మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించాడు. అంతేకాకుండా తన వీడియో సక్సెస్ అవ్వడంపై సెలబ్రేట్ చేసుకున్నాడు." అని యామీ గౌతమ్ తెలిపింది.

"అతడకి అనిపించవచ్చు నాకు కామెంట్లు వచ్చాయి నేను హ్యాపీగా ఉన్నానని, కానీ ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించినప్పుడు మళ్లీ ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయి. ఆ వీడియో చూసిన తర్వాత మా ఇంటికి కెమెరా తీసుకుని చాలా మంది వచ్చారు. నాకు ఆశ్చర్యమేసింది. అసలు ఏం జరుగుతుంంది ఇక్కడ? ఎక్కడకు వెళ్తున్నాం మనం? ఇలాంటి చర్యల వల్ల తర్వాతి తరానికి ఇది చాలా సాధారణ విషయమని సంకేతాలిస్తున్నారు. కాబట్టి నేను వద్దని వారించి పంపించేశాను. వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వాటికి మధ్య సన్నని గీత తప్పకుండా ఉండాలి." అని యామీ గౌతమ్ తెలిపింది.

యామీ గతేడాది హిమాచల్ ప్రదేశ్‌లోని తన హోమ్ టౌన్‌లో ఉన్న ఫామ్‌కు వెళ్లి అక్కడ సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. తమ ఫామ్‌లో ఏ పంట పండిస్తున్నారు? అది ఎలా పెరుగుతుంది? లాంటి విశేషాలను షేర్ చేశారు.

పని విషయానికొస్తే యామీ గౌతమ్ చివరగా ఈ నెలలో విడుదలైన లాస్ట్‌లో కనిపించింది. అనిరుధ్ధ రాయ్ చౌదరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది కాకుండా ఓ మై గాడ్ 2, చోర్ నికల్ కర్ భాగా అనే సినిమాలు చేస్తుంది.

Whats_app_banner