తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamir Khan On Acting : సినిమాలు చేసేందుకు నేను రెడీగా లేను.. అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Aamir Khan On Acting : సినిమాలు చేసేందుకు నేను రెడీగా లేను.. అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Anand Sai HT Telugu

01 June 2023, 8:15 IST

    • Aamir Khan On Actiing : బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమాలు ప్రత్యేకం. బలమైన కథలు ఉన్న సినిమాలు చాలా చేశాడు. కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉన్నాడు. ఈ విషయంపై తాజాగా స్పందించాడు.
అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ (twitter)

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్ కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉన్నాడు. అయితే, చిత్ర పరిశ్రమతో అతని అనుబంధం కొనసాగుతూనే ఉంది. రీసెంట్‌గా మళ్లీ యాక్టింగ్‌లోకి రావడం గురించి మాట్లాడాడు. చాలా పరాజయాల కారణంగా నటనకు విరామం తీసుకున్నాడు అమీర్. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనేది అతని ఉద్దేశం. ఇదే విషయం పదే పదే చెబుతూనే ఉన్నాడు. అమీర్ ఖాన్(Aamir Khan) సుదీర్ఘ విరామం తీసుకోవడం చాలా మంది ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తోంది. నిర్మాతలు కూడా అమీర్ ఖాన్ పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ అమీర్ ఖాన్ మళ్లీ ఎప్పుడు నటనలోకి వస్తాడు? అన్న ప్రశ్నకు స్వయంగా అమీర్‌ఖాన్‌ సమాధానమిచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Asuraguru Review: అసుర గురు రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా'(lal singh chaddha) చిత్రం భారీ ఫ్లాప్‌గా నిలిచింది. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'ని హిందీలో రీమేక్ చేయడంలో అమీర్ ఖాన్ విఫలమయ్యాడు. ఆ తర్వాత అమీర్‌ఖాన్‌కి కొంత విరామం అవసరం అనిపించింది. అందుకే నటనకు దూరంగా ఉన్నాడు. అయితే, చిత్ర పరిశ్రమతో అతని అనుబంధం కొనసాగుతోంది. రీసెంట్‌గా మళ్లీ యాక్టింగ్‌లోకి రావడం గురించి మాట్లాడాడు.

పంజాబీ చిత్రం 'క్యారీ ఆన్ జట్టా 3' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి అమీర్ హాజరయ్యాడు. లాల్ సింగ్ చద్దా తర్వాత ఏ సినిమాను ప్రకటించలేదని అమీర్ ఖాన్ కు ప్రశ్నలు వచ్చాయి. దీనిపై స్పందించాడు. 'నా కుటుంబంతో సమయం గడుపుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఏ సినిమా చేయాలని నిర్ణయించుకోలేదు. నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. ప్రస్తుతానికి చేయాల్సిన పని ఇదేననిపిస్తోంది. ఎమోషనల్‌గా రెడీ అయ్యాక సినిమా చేస్తాను.' అన్నాడు.

అమీర్ ఖాన్ వ్యక్తిగత కారణాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. 2021లో కిరణ్‌రావు(Kiran Rao)తో విడాకులు తీసుకున్నాడు. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తర్వాత అమీర్ ఖాన్ పై అనేక గాసిప్స్ వచ్చాయి. నటి ఫాతిమా సాహా షేక్‌తో అతను చాలా సన్నిహితంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. వీరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటికే అమీర్ ఖాన్ ఇద్దరిని చేసుకుని విడాకులు తీసుకున్నాడు. కిరణ్ రావు కంటే ముందు రీనా దత్తాతో అమీర్ వివాహం జరిగింది. ఆమెతోనూ విడాకులు తీసుకున్నాడు. కిరణ్ రావుతో 2021లో విడిపోయాడు. విడిపోయినా.. నా మాజీ భార్యలతో సంబంధాలు బాగానే ఉంటాయని అమీర్ ఖాన్ గతంలో చెప్పాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.