Malaika Arora: మరీ న్యూడ్ ఫొటో పోస్ట్ చేయడానికి సిగ్గులేదా.. మలైకాపై మండిపడుతున్న ఫ్యాన్స్
Malaika Arora: మరీ న్యూడ్ ఫొటో పోస్ట్ చేయడానికి సిగ్గులేదా అంటూ మలైకాపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. తన బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ కు చెందిన ఓ ఫొటోను ఆమె పోస్ట్ చేయడంపై అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Malaika Arora: మరీ న్యూడ్ ఫొటో పోస్ట్ చేస్తావా అంటూ బాలీవుడ్ నటి మలైకా అరోరాను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటోనే దీనికి కారణం. సోషల్ మీడియా, ఓటీటీలు వచ్చిన తర్వాత బూతు నట్టింట్లోకి సులువుగా వచ్చేస్తున్న సంగతి తెలుసు కదా. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్న కాలంలో.. వాళ్ల పోస్టులకు సెన్సార్ లేకుండా పోతోంది.
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లో హీరోయిన్ల హాట్ ఫొటోలకు కొదవే లేదు. అయితే తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరా.. తన బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ కు చెందిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ ఫొటో చూడగానే అభిమానులకు మండిపోయింది. అందులో అర్జున్ ఒంటిపై నూలిపోగు లేకుండా తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా మాత్రం ఓ దిండును అడ్డంగా పెట్టుకున్నాడు.
నా లేజీ బాయ్ అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ మలైకాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. "ఇది మాకెందుకు చూపిస్తున్నావ్. బట్టలు లేకుండా అర్జున్ ను చూడలేము. అసలు బట్టలు ఉన్నా అతన్ని చూడలేకపోతున్నాం" అని ఓ యూజర కామెంట చేయడం విశేషం. ఇలాంటి ఫొటో పోస్ట్ చేస్తున్న సమయంలో ఆమె తాగి ఉందా ఏంటి అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఫొటోలు చూడటానికి నేను నా ఇంటర్నెట్ బిల్స్ కట్టడం లేదంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. ఇక ఎవరూ అర్జున్ ను ఇలా చూడాలనుకోరు అంటూ ఇంకొక యూజర్ అన్నారు. మలైకా, అర్జున్ కపూర్ కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.
2019లోనే వీళ్లు తమ రిలేషన్షిప్ ను పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. 37 ఏళ్ల అర్జున్ కపూర్.. 49 ఏళ్ల వయసు, అంతకుముందే అర్బాజ్ ఖాన్ తో ఇద్దరు పిల్లలకు తల్లయిన మలైకాతో డేటింగ్ ఏంటని చాలా మంది ట్రోల్ చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అందులో తిట్టిన వాళ్లే తాను కనిపిస్తే తనతో సెల్ఫీ దిగడానికి ఎగబడతారని గతంలో అర్జున్ అన్నాడు.
సంబంధిత కథనం