Gulshan Devaiah Crush: సాయి పల్లవి కోసం పడి చచ్చిపోతున్న బాలీవుడ్ నటుడు.. ఆమె అంటే పిచ్చి ప్రేమంట..!
Gulshan Devaiah Crush: ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి అంటే ఓ బాలీవుడ్ నటుడు పడి చచ్చిపోతున్నాడు. అతడెవరో కాదు గుల్షన్ దేవయ్య. ఆమెతో కలిసి పని చేసేందుకు ఆరాటపడుతున్నాడు. తనకు ఆమె అంటే క్రష్ అని చెప్పాడు.
Gulshan Devaiah Crush: సాయి పల్లవి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. మేకప్ లేకుండా తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అందంతో పాటు తన అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సాయి పల్లవిపై ఎంతో మందికి క్రష్ ఉండే ఉంటుంది. ఆమె అందానికి, పర్ఫార్మెన్స్‌కు సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.. సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె తన క్రష్ అంటూ స్పష్టం చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన గుల్షన్.. సాయి పల్లవి అంటే తనకు క్రష్ అని, అయితే ఆమెకు చెప్పే సాహసం చేయలేదని తెలిపాడు. "నాకు సాయి పల్లవి అంటే చాలా క్రష్. చాలా కాలం నుంచి ఆమె అంటే ఇష్టం ఉంది. ఆమె నంబర్ కూడా నా వద్ద ఉంది. కానీ ఆమె దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పే సాహసం చేయలేదు. ఆమె వండర్‌ఫుల్ డ్యాన్సర్, అద్భుతమైన నటి. ఆమె అంటే నాకు క్రష్ మాత్రమే. అంతకుమించి ఏమి లేదని అనుకుంటున్నా. కొన్నిసార్లు ఆమెను చూసి ఆకర్షితుడిని అయ్యాను. కానీ ఆమె ఎంతో సమర్థురాలైన నటి. ఏదోక రోజు ఆమెతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందేమోనని ఆశిస్తున్నా. అది చాలు నేను ఆనందంగా ఉండటానికి. మిగతాది నాకు తెలియదు. ఒకవేళ మిగిలినది జరగకపోతే ఏం చేస్తాను? అని కూడా అనిపిస్తుంది. అంటూ సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమో చెప్పాడు" గుల్షన్ దేవయ్య.
"ఆ ఉద్దేశం ఉంటే అది జరుగుతుంది. ఒకవేళ ఆ ఉద్దేశ్యం లేకపోతే జరగదు. అయితే మంచి నటితో నటించే అవకాశం వస్తే మాత్రం బాగుంటుంది. అందులో తప్పేమి లేదు. కనీసం అంతవరకైనా సర్దుకుంటాను" అని గుల్షన్ తెలిపాడు. అతడి వ్యాఖ్యలు బట్టి చూస్తే సాయి పల్లవితో వర్క్ చేయాలని, ఆమెతో తన అభిప్రాయాన్ని చెప్పాలని గుల్షన్ తహతహలాడుతున్నాడని మాత్రం అర్థమవుతుంది. మరి ఈ హీరో కోరికను సాయి పల్లవి తీరుస్తుందో లేదో చూడాలి.
గుల్షన్ చివరిసారిగా సయామీ ఖేర్‌తో కలిసి 8 AM మెట్రో అనే సినిమాలో నటించాడు. ఇది కాకుండా గన్స్ అండ్ గులాబ్స్, లవ్ ఎఫైర్ లాంటి సినిమాలు ఉన్నాయి. గుల్షన్ దేవయ్య సైతాన్, హేట్ స్టోరీ, హంటర్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.