HBD Sai Pallavi : నిజంగానే సాయి పల్లవి హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్..-happy birthday sai pallavi special story on talented actress sai pallavi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hbd Sai Pallavi : నిజంగానే సాయి పల్లవి హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్..

HBD Sai Pallavi : నిజంగానే సాయి పల్లవి హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్..

Anand Sai HT Telugu
May 09, 2023 08:28 AM IST

HBD Sai Pallavi : సాయి పల్లవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెలను ఫిదా చేసేసింది ఈ పిల్ల. భానుమతి ఒక్కటే పీస్ అంటూ.. మెుదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకోంది. మే 9న ఆమె పుట్టిన రోజు.

సాయి పల్లవి బర్త్ డే
సాయి పల్లవి బర్త్ డే (twitter)

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపారేసింది సాయిపల్లవి. మెుదటి సినిమాకే ప్రేక్షకులు గుర్తుండిపోయేలా చేసింది. ఎవరబ్బా.. ఈ పిల్ల అనుకునేలా అందరినీ తనవైపు తిప్పుకుంది. ఇటు డ్యాన్స్.. మరోవైపు తెలంగాణ యాసతో ఫిదా సినిమాతో ఫిదా చేసేసింది. నిజానికి హీరోయిన్ ఫార్మాట్ నే మార్చేసింది సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఏ స్టోరీ పడితే.. ఆ స్టోరీ చేసే హిరోయిన్స్ ఉన్న ఈ కాలంలో .. కథ నచ్చితేనే సైన్ చేస్తానని డైరెక్టుగా చెప్పేస్తుంది. ఎక్స్ పోజింగ్ కు చాలా దూరం. అందుకే సాయి పల్లవికి చాలా మంది ఫ్యాన్స్. లేడీ పవర్ స్టార్ అంటూ అభిమానులు పిలిచేలా చేసుకుంది.

హీరోయిన్ అంటే ఇలానే ఉండాల్రా బాబు.. అనుకునేలా చేసింది సాయి పల్లవి. తన డ్యాన్స్, తన నటన, ప్రవర్తనతో తెలుగు ప్రేక్షకుల ఇళ్లలోకి వెళ్లింది. స్టోరీలు కూడా ఏదీ పడితే అది ఒప్పుకోదు. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రల్లోనే నటిస్తుంది. ఇక ఆమె డ్యాన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డ్యాన్స్ చూసేందుకే థియేటర్లలోకి వచ్చేవాళ్లూ ఉన్నారు. ఫిదా సినిమాలో వచ్చిండే పాట కావొచ్చు, లవ్ స్టోరీ సినిమాలో సారంగదరియా పాట, శ్యామ్ సింగరాయ్ లో ప్రణవాలయ పాట కావొచ్చు.. ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తుండిపోయే డ్యాన్స్ చేసింది సాయి పల్లవి. ఒకానోక సమయంలో మెగాస్టార్ చిరంజీవే ఆమెతో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పడం విశేషం.

మెుదటి సినిమాలో ఆమె చెప్పినట్టుగా.. నిజంగానే సాయి పల్లవి సింగిల్ పీస్. చాలామంది హీరోయిన్లతో పోలీస్తే డిఫరెంట్. సినిమాలోని కేరక్టర్ ఏదైనా.. ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది.. ఎక్కడా సాయి పల్లవి కనిపించదు. పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటుంది. గ్లామర్ షోలకు చాలా దూరం. తనకు కథ నచ్చకుంటే.. అస్సలు పట్టించుకోదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. స్టార్ హీరోలు సైతం.. యాడ్స్ వస్తుంటే చేసేస్తారు. కానీ కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా.. యాడ్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ కోణం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

మెుదటి సినిమా ఫిదాతోనే తన క్యారెక్టర్ కు తనే డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మారి 2లో ఆమె రౌడీ బేబీ సాంగ్.. యూట్యూబ్ లో ఓ రికార్డు. అయితే తెలుగులో చాలా రోజులుగా ఆమె సినిమాల గురించి మాత్రం అప్డేట్ లేదు. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తీకేయన్ సినిమాలో నటిస్తోంది.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. సాయి పల్లవి గురించి చాలా మాటలు ఉంటాయి. ఎందుకంటే.. ఆమెదో డిఫరెంట్ క్యారెక్టర్. తను అలా ఉంటేనే ఫ్యాన్స్ కు నచ్చుతుంది. తమిళనాడులోని ఊటికి సమీపంలో ఓ చిన్న గ్రామంలో పుట్టింది సాయి పల్లవి. దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉన్న నటిగా ఎదిగింది. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ.. Happy Birthday Sai Pallavi..

IPL_Entry_Point