Khan's Party : ఆ ఇంట్లో అమీర్, సల్మాన్, షారుక్ ఖాన్.. తెల్లార్లు పార్టీ-salman khan shah rukh khaan aamir khan party together in galaxy apartment details inside
Telugu News  /  Entertainment  /  Salman Khan Shah Rukh Khaan Aamir Khan Party Together In Galaxy Apartment Details Inside
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్

Khan's Party : ఆ ఇంట్లో అమీర్, సల్మాన్, షారుక్ ఖాన్.. తెల్లార్లు పార్టీ

26 May 2023, 10:48 ISTAnand Sai
26 May 2023, 10:48 IST

Khan's Party : సెలబ్రిటీల ఇంట్లో తరచూ పార్టీలు జరుగుతుంటాయి. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. కానీ సల్మాన్ ఖాన్ నిర్వహించిన పార్టీ గురించి లీక్ అయింది.

అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోలు. వీరి మధ్య తరచూ విభేదాలతో ఒకరి ముఖం ఒకరు చూసుకోని పరిస్థితి కూడా ఉంది. కానీ, ఇప్పుడు కాలం మారింది. ముగ్గురి మధ్య సాన్నిహిత్యం ఉంది. తాజాగా ఈ ముగ్గురూ ఒక్కటయ్యారు. కలిసి పార్టీ చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఈ పార్టీ సాగిందని అంటున్నారు.

సెలబ్రిటీల ఇంట్లో తరచూ పార్టీలు జరుగుతుంటాయి. అయితే ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతారు. అస్సలు అలాంటి విషయాలు బయటకు రానేరావు. కానీ సల్మాన్ ఖాన్(Salman Khan) నిర్వహించిన పార్టీ మాత్రం లీక్ అయింది. ఈ ముగ్గురు సల్మాన్ ఖాన్ ముంబై నివాసంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. ఈ గెట్ టుగెదర్ మే 16న జరిగింది.

ఈ పార్టీకి ముందుగా వచ్చిన వ్యక్తి అమీర్ ఖాన్(Aamir Khan). 'టైగర్ 3' సెట్స్ నుండి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్(shah Rukh Khaan) నేరుగా ఈ పార్టీకి వెళ్లారు. ఈ సందర్భంగా వృత్తి జీవితం గురించి చర్చించుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ పార్టీ జరిగిందట.

ఈ మధ్య కాలంలో సల్లూ, షారుక్, అమీర్ ఖాన్ కు సరైన విజయాలు లేవు. ఇందులో షారుక్ ఖాన్ 'పఠాన్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అనుకున్నంత స్థాయిలో సినిమా ఆడలేదు. అమీర్ ఖాన్ నటనకు విరామం ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'(Tiger 3) సినిమా పనుల్లో పాల్గొంటున్నాడు. ఇక ఆశలన్నీ టైగర్-3పైనే పెట్టుకున్నాడు. ఇందులో షారుఖ్ కూడా గెస్ట్ రోల్ పోషించనుండటంతో సినిమాపై బజ్ ఏర్పడింది. టైగర్-3ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.35 కోట్లు వెచ్చిచ్చిస్తున్నారట. సల్మాన్-షారుఖ్ ఇద్దరూ ఇందులో భాగమవుతారట.

సంబంధిత కథనం