Salman Khan : హాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్-salman khan promotes hollywood movie guardians of the galaxy volume 3
Telugu News  /  Entertainment  /  Salman Khan Promotes Hollywood Movie Guardians Of The Galaxy Volume 3
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (Girish Srivastav)

Salman Khan : హాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్

03 May 2023, 8:02 ISTAnand Sai
03 May 2023, 8:02 IST

Guardians Of The Galaxy : ఇండియాలో మరో హాలీవుడ్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మార్వెల్ యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతోంది. దీనిని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నాడు.

బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి తడబడుతుండగా, సల్మాన్ ఖాన్(Salman Khan) హాలీవుడ్ సినిమాలను ప్రమోట్ చేయడానికి దిగాడు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాగే సల్మాన్ ఖాన్ కూడా వరుస పరాజయాలను చవిచూశాడు. ఆయన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఐదేళ్లకు పైగా అయ్యింది. తన సొంత సినిమాలు బాక్సాఫీస్ వద్ద మునిగిపోతున్న తరుణంలో సల్మాన్ ఖాన్ ఓ హాలీవుడ్ సినిమా(Hollywood) ప్రమోషన్ లో అడుగుపెట్టాడు.

మార్వెల్(Marvel) పాపులర్ మూవీ సిరీస్‌లలో ఒకటైన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూడో చిత్రం విడుదలవుతోంది. సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని భారతదేశంలో ప్రమోట్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ దీని గురించి ఒక వీడియోను పంచుకున్నాడు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3కి స్వాగతం పలికాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ యాడ్ లో సల్మాన్ నటించాడు.

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ(Guardians Of The Galaxy) చిత్రం తరపున ప్రమోషనల్ వీడియోను షేర్ చేశాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా సిరీస్‌లోని పాపులర్ క్యారెక్టర్ గ్రూట్ నుండి ప్రేరణ పొందినట్టుగా ఓ వీడియో చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగే ప్రశ్నలన్నింటికీ గ్రూట్ లాగే సమాధానమిస్తాడు సల్మాన్. ఐయామ్ సల్మాన్ ఖాన్ అని చెబుతుంటాడు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలో గ్రూట్ కూడా ఇలాగే ఐయామ్ గ్రూట్ అని చెబుతాడు. వీడియోలో ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిశాక, సల్మాన్ ఖాన్ వెళ్లేటప్పుడు జాకెట్ తీస్తే, అతని టీ-షర్ట్ వెనుక గ్రూట్(Groot) చిత్రం ఉంటుంది. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 3లో సల్మాన్ ఖాన్ వాయిస్ ఇచ్చి ఉండవచ్చనే సందేహాలు ఉన్నాయి.

మార్వెల్ యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా మొదటి వాల్యూమ్ 2014లో విడుదలైంది. రెండో వాల్యూమ్ 2017లో రిలీజైంది. ఇండియా(India)లో కూడా వీటికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతుంది. మే 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవనుంది.

భారతదేశంలోనూ మార్వెల్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సల్మాన్ యాడ్ తో ఇండియాలో ఈ సినిమా భారీ మార్కెట్ మీద కన్నేసినట్టుగా అర్థమవుతోంది. మార్వెల్ స్టూడియోస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మే 5న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్