Salman Khan : సల్మాన్ ఖాన్​కు పెళ్లి వద్దట.. కానీ పిల్లలు కావాలట-actor salman khan want to become father without marriage but indian law does not allow it says sallu bhai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Actor Salman Khan Want To Become Father Without Marriage But Indian Law Does Not Allow It Says Sallu Bhai

Salman Khan : సల్మాన్ ఖాన్​కు పెళ్లి వద్దట.. కానీ పిల్లలు కావాలట

Anand Sai HT Telugu
May 01, 2023 03:56 PM IST

Salman Khan On Children's : పెళ్లి కాని సల్మాన్ ఖాన్ తండ్రి కావాలనే కోరికను వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాన్ కి పిల్లలంటే చాలా ఇష్టం. తన సోదరులు, సోదరి అర్పితా ఖాన్ పిల్లలతో ఎంత సన్నిహితంగా ఉంటాడో కూడా చాలా వీడియోలు ఉన్నాయి.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (Girish Srivastav)

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అని ప్రశ్నిస్తే అందరూ చెప్పే పేరు సల్మాన్ ఖాన్(Salman Khan). ప్రస్తుతం సల్లూ భాయ్ వయసు 57 ఏళ్లు. ఇన్నేళ్ల తర్వాత కూడా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే పిల్లల గురించి సల్మాన్ ఖాన్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్(Salman Khan) పెళ్లి చేసుకోలేదు. చాలా మంది నటీమణులతో అతడికి ప్రేమ కథలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కు జూహీ చావ్లా అంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటానని.. జూహీ చావ్లా తండ్రి వద్ద ప్రతిపాదన పెట్టాడు సల్మాన్. కానీ ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ప్రేమ కథ అక్కడితో ముగిసిందని సల్మాన్ ఖాన్ కొన్ని ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. ఐశ్వర్యరాయ్, సంగీతా బిజ్లానీలతోనూ సల్మాన్ లవ్ ట్రాక్ నడిపినట్టుగా వినిపించింది. ఇక ఆ తర్వాత పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ పిల్లలు అంటే మాత్రం అతడికి చాలా ఇష్టం. ఇటీవల పిల్లల గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కాని సల్మాన్ ఖాన్ తండ్రి కావాలనే కోరికను వ్యక్తం చేశాడు. తన సోదరులు, సోదరి అర్పితా ఖాన్ పిల్లలతో ఎంత సన్నిహితంగా ఉంటాడో కూడా చాలా వీడియోలు ఉన్నాయి. 'పిల్లలు వస్తే అమ్మ రావాలి. నేను తండ్రి కావాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు భారతదేశంలో అలాంటి చట్టం లేదు. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మన చట్టం నన్ను తండ్రిని కానివ్వడం లేదు.' అని సల్మాన్ ఖాన్ అన్నారు.

పిల్లల గురించి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్(Viral) అవుతున్నాయి. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడానికి మన చట్టం ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవడం మంచిది. అప్పుడు మీకు భార్య కూడా లభిస్తుంది. తమకు కూడా సంతానం కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఓటీటీలపై సల్మాన్ ఫైర్

'ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్‌లను సెన్సార్ లేకుండా ప్రదర్శిస్తారు. దీని వల్ల పిల్లలకు ఇబ్బందులు కలగడమే కాకుండా పెద్దలు కూడా ఇబ్బంది పడాలి. OTT కంటెంట్‌ను కూడా సెన్సార్ చేయాలన్నదే నా అభిప్రాయం. అసభ్యత, నగ్నత్వం ఆగిపోవాలి. ఇప్పుడు కూడా పిల్లలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇంట్లో అందుబాటులో ఉన్నందున అన్నీ చూస్తున్నారు.' సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. స్కూల్‌కి వెళ్ళే పిల్లలు మీ మొబైల్‌లో OTT అసభ్యకరమైన కంటెంట్‌ను చూడటం ఎంతవరకు సబబు? అని సల్మాన్ ప్రశ్నించారు.

సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’(kisika bhai kisiki jaan) సినిమా ఇటీవలే విడుదలైంది. సల్మాన్‌ ఖాన్‌ తన హోమ్‌ బ్యానర్‌పై నిర్మించిన తమిళ చిత్రం 'వీరమ్‌'కి ఇది రీమేక్‌. సల్మాన్ సరసన పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. తెలుగు నటుడు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఈ చిత్రంలో కనిపించారు. కేజీఎఫ్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూరు ఈ సినిమా పాటలకు సంగీతం అందించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.