Pushpa 2 Audio Rights: వామ్మో.. పుష్ప 2 ఆడియో హక్కుల కోసమే అన్ని కోట్లా.. ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు?
Pushpa 2 Audio Rights: వామ్మో.. పుష్ప 2 ఆడియో హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయ్యాయట. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదొక సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.
Pushpa 2 Audio Rights: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా నిలుస్తోంది పుష్ప ది రూల్. బాలీవుడ్ సినిమాలను కూడా తలదన్ని ఈ సినిమా ముందు వరుసలో ఉండటం విశేషమే. పుష్ప ది రైజ్ సక్సెస్ తో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే స్థాయిలో ఈ సినిమా బిజినెస్ కూడా ఉండబోతోందని తాజా రిపోర్టు ప్రకారం తెలుస్తోంది.
ఎందుకంటే ఈ సినిమా ఆడియో హక్కులే రికార్డు ధరకు అమ్ముడయ్యాయట. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక ధర పలికినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 ఏ స్థాయిలో హిట్టయ్యిందో.. అందులోని పాటలు కూడా అంతకంటే ఎక్కువ హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో పలు రికార్డులను బ్రేక్ చేశాయి.
దీంతో సహజంగానే పుష్ప 2 ఆడియో హక్కుల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమా ఆడియో హక్కులు ఏకంగా రూ.65 కోట్లకు అమ్ముడవడం విశేషం. గతంలో ఆర్ఆర్ఆర్ రూ.25 కోట్లు, సాహో రూ.22 కోట్లు, బాహుబలి 2 రూ.10 కోట్లు పలికాయి. వాటితో పోలిస్తే పుష్ప ది రూల్ ఆడియో హక్కుల ధర ఎంతో ఎక్కువ. ఇక ఈ సినిమా హిందీ హక్కులకు కూడా డిమాండ్ మామూలుగా లేదు.
నిజానికి పుష్ప పార్ట్ 1 సౌత్ కంటే కూడా నార్త్ లోనే ఎక్కువ వసూలు చేసింది. అల్లు అర్జున్ మాస్ లుక్ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. దీంతో సీక్వెల్ గురించి కూడా నార్త్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఫలితమే ఇప్పుడు ఆడియో హక్కుల రూపంలో కనిపిస్తోంది. టీ-సిరీస్ ఈ భారీ మొత్తానికి ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
ఈ మధ్యే టీ-సిరీస్ భూషణ్ కుమార్, పుష్ప 2 మేకర్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆడియో హక్కుల రూపంలోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. పుష్ప 2 లాభాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని స్పష్టవుతోంది. ఈ సినిమాను సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాదే సీక్వెల్ కు కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
సంబంధిత కథనం