Upasana baby shower: ఉపాసన సీమంతం.. అల్లు అర్జున్, సానియా మీర్జా పిక్స్ వైరల్-upasana baby shower as allu arjun and sania attends the event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Upasana Baby Shower As Allu Arjun And Sania Attends The Event

Upasana baby shower: ఉపాసన సీమంతం.. అల్లు అర్జున్, సానియా మీర్జా పిక్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Apr 24, 2023 02:38 PM IST

Upasana baby shower: ఉపాసన సీమంతం వేడుకకు అల్లు అర్జున్, సానియా మీర్జా వచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉపాసన సీమంతం వేడుకల్లో అల్లు అర్జున్, సానియా మీర్జా
ఉపాసన సీమంతం వేడుకల్లో అల్లు అర్జున్, సానియా మీర్జా

Upasana baby shower: ఉపాసన సీమంతం వేడుకలు ఆదివారం (ఏప్రిల్ 23) హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఇంతకుముందే ఒకసారి దుబాయ్ లో ఈ వేడుకలు జరగగా.. తాజాగా ఇప్పుడు ఇంట్లోనూ ఆమె బేబీ షవర్ జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ తోపాటు మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా రావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పెళ్లయిన పదేళ్ల తర్వాత తొలిసారి ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన వార్తను గతేడాది రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసనకు ఏడో నెల. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆమెకు సీమంతం చేశారు. దీనికి స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ తోపాటు సానియా కూడా రావడం విశేషం.

ఈ ఫొటోలను ఉపాసనతోపాటు అల్లు అర్జున్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఉపాసనతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సీ అని బన్నీ కామెంట్ చేశాడు. ఇక ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఫొటోల్లో సానియా మీర్జా కూడా కనిపించింది. మరో ఫొటోలో ఉపాసన.. తన తల్లి, అత్తతో కలిసి కనిపించింది.

ఆ మధ్య దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన అక్కడ కూడా తన కజిన్స్ తో కలిసి సీమంతం వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ ఫొటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన తర్వాత చరణ్ తో కలిసి అమెరికా, జపాన్, యూఏఈలాంటి దేశాల టూర్లకు వెళ్లింది ఉపాసన.

IPL_Entry_Point

సంబంధిత కథనం