Allu Arjun Bollywood Entry: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న అల్లు అర్జున్ - నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో మూవీ-allu arjun to make his bollywood debut with aditya dhar the immortal ashwatthama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun To Make His Bollywood Debut With Aditya Dhar The Immortal Ashwatthama Movie

Allu Arjun Bollywood Entry: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న అల్లు అర్జున్ - నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 15, 2023 06:39 AM IST

Allu Arjun Bollywood Entry: స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun Bollywood Entry: టాలీవుడ్ హీరోల‌కు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి ఆఫ‌ర్స్ క్యూ క‌డుతోన్నాయి. తెలుగు సినిమాలు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో అద్భుత విజ‌యాల్ని సాధిస్తూ వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంటోన్నాయి. దాంతో తెలుగు హీరోల‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిని చూపుతోన్నారు.

ఇప్ప‌టికే వార్ -2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోన్నారు. తాజాగా స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌, ఉరి ఫేమ్ ఆదిత్య ధ‌ర్ ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌ పేరుతో ఓ మైథలాజిక‌ల్ మూవీని తెర‌కెక్కించేందుకు చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు.

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో హీరోలుగా తొలుత విక్కీ కౌశ‌ల్ ఆ త‌ర్వాత‌ ర‌ణ్‌వీర్‌సింగ్ పేర్లు వినిపించాయి. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల విక్కీ కౌశ‌ల్, ర‌ణ్‌వీర్‌సింగ్‌ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు.

బాలీవుడ్ హీరోలు వైదొల‌గ‌డంతో వారి స్థానంలో టాలీవుడ్ హీరోతో సినిమాను తెర‌కెక్కించేందుకు ఆదిత్య ధ‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోన్న‌ట్లు తెలిసింది. అత‌డితో పాటు మ‌రో ఛాయిస్‌గా ఎన్టీఆర్ పేరును ప‌రిశీలిస్తోన్న‌ట్లు చెబుతున్నారు.

ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ సినిమాలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ల‌లో ఎవ‌రు హీరోగా న‌టిస్తార‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత ఫైన‌లైజ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప -2 షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్‌ను ఇటీవ‌లే మొద‌లుపెట్టాడు ఎన్టీఆర్‌.

IPL_Entry_Point