Vetrimaran on NTR Movie: అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో మూవీపై వెట్రిమారన్ కామెంట్స్ ఇవీ-vetrimaran on ntr movie says project going to happen soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vetrimaran On Ntr Movie Says Project Going To Happen Soon

Vetrimaran on NTR Movie: అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో మూవీపై వెట్రిమారన్ కామెంట్స్ ఇవీ

Hari Prasad S HT Telugu
Apr 11, 2023 06:38 PM IST

Vetrimaran on NTR Movie: అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో మూవీపై డైరెక్టర్ వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ విడుదలై కోసం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అతడు ఈ మూవీపై స్పందించాడు.

విడుదలై మూవీ లొకేషన్ లో డైరెక్టర్ వెట్రిమారన్
విడుదలై మూవీ లొకేషన్ లో డైరెక్టర్ వెట్రిమారన్

Vetrimaran on NTR Movie: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో ఒకడు వెట్రిమారన్. ఇప్పటికే అతడు తీసిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆడుకాలం, విసరనాయ్, అసురన్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక అతడు తీసిన మరో సినిమా విడుదలై. ఈ మూవీ తొలి పార్ట్ ఈ మధ్యే రిలీజై మంచి టాక్ కొట్టేసింది.

అలాంటి డైరెక్టర్ మన టాలీవుడ్ లోని టాప్ హీరోలతో సినిమా తీయడానికి ఆసక్తిగా ఉన్నాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులతో ఇప్పటికే అతడు సంప్రదింపులు కూడా జరపడం విశేషం. ఈ విషయాన్ని వెట్రిమారనే ఈ మధ్య హైదరాబాద్ లో ప్రెస్ మీట్ సందర్భంగా వెల్లడించాడు. తాను త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు కూడా చెప్పాడు.

"ఆడుకాలం తర్వాత నేను అల్లు అర్జున్ ను కలిశాను. మేము చెన్నైలోనూ కలిశాం. తాను తమిళంలోకి రావాలని అనుకుంటున్నట్లు అతడు నాతో చెప్పాడు. వడచెన్నైలోని ఓ క్యారెక్టర్ ను అతనికి నేను చెప్పాను. కానీ ఇప్పుడు దానిని నేను మార్చాను. ఈ కొత్త క్యారెక్టర్ ను కూడా అల్లు అర్జున్ తో చెప్పాను" అని వెట్రిమారన్ వెల్లడించాడు.

"నేను మహేష్ బాబును కూడా కలిశాను. ఇక అసురన్ తర్వాత లాక్‌డౌన్ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ ను కలిశాను. మేమిద్దరం ఓ ప్రాజెక్ట్ పై మాట్లాడుతున్నాం. అది జరుగుతుంది. కానీ మూవీ స్టార్ట్ చేయడానికి మాత్రం కాస్త సమయం పడుతుంది" అని వెట్రిమారన్ చెప్పాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో ఈ ముగ్గురిలో ఎవరు సినిమా చేసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం.

IPL_Entry_Point

సంబంధిత కథనం