Allu Arjun Fitness : అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు-actor allu arjun diet and fitness secrets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Allu Arjun Fitness : అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు

Allu Arjun Fitness : అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు

HT Telugu Desk HT Telugu
Apr 09, 2023 10:17 AM IST

Allu Arjun Workout Plan : అల్లు అర్జున్.. పాన్ ఇండియా స్టార్. 41 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌గా ఉంటాడు. అయితే బన్నీ పాటించే.. ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

అల్లు అర్జున్
అల్లు అర్జున్ (twitter)

Allu Arjun Fitness Secret : అల్లు అర్జున్ ఇండియన్ సినిమాలో మోస్ట్ ఫేవరెట్ నటుడు. సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి చాలా హిట్ సినిమాలను అందించాడు. అల్లు అర్జున్(Allu Arjun) డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ లను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. బన్నీ(Bunny) క్రేజ్ సౌత్ లోనే కాదు. పుష్ప(Pushpa) సినిమా విడుదలయ్యాక ఇండియా మెుత్తం పెరిగింది. తొలి పాన్ ఇండియా చిత్రం(Pan India) పుష్ప ద్వారా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంతకాలం స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్పలో రగ్గడ్ లుక్ లో కనిపించాడు. మరో విషయం ఏంటంటే.. 41 ఏళ్ల వయసులోనూ అల్లు అర్జున్ చాలా ఫిట్ గా కనిపించడం, అతడి ఫిట్ నెస్(Fitness) సీక్రెట్ పై అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. అంత ఫిట్‌గా ఉండాలంటే వర్కవుట్ ఎలా చేస్తాడో మీరూ చూడండి.

అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్(Allu Arjun Fitness Secret) ఏమిటంటే.. ఉదయం నిద్రలేచిన వెంటనే 45 నిమిషాల పాటు జాగింగ్ చేయడం. తనకు జాగింగ్ అంటే చాలా ఇష్టమని, చాలా ఎంజాయ్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది బన్నీ దినచర్యలో భాగం, రోజూ జాగింగ్ చేయడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

కాలిస్టెనిక్స్.. ఇది ఒక రకమైన వ్యాయామం. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు ఏ విధమైన పరికరాలు ఉపయోగించరు. కాలిస్టెనిక్స్‌లో(Calisthenics Workouts) పుషప్‌లు, పుల్‌అప్‌లు, చినుప్‌లు, డిప్స్, జంప్‌లు, స్క్వాట్‌లు, క్రంచెస్, జంపింగ్ రోప్ వంటి వ్యాయామాలు ఉంటాయి. అల్లు అర్జున్ రోజూ కాలిస్టెనిక్స్ వ్యాయామాలు కూడా చేస్తుంటాడు.

సైకిల్ తొక్కడం(Cycling) కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లు అర్జున్ ఎలాంటి వర్కౌట్ చేసినా ఎంజాయ్ చేస్తుంటాడు. ముఖ్యంగా సైకిల్ తొక్కడం. అయితే ఒక్కోసారి సైకిల్ తొక్కడం కూడా ఇష్టం. సైక్లింగ్ కూడా మనల్ని ఫిట్‌గా ఉంచుతుంది.

మనం కూడా రోజూ భోజనం, స్నాక్స్‌ని ఏ విధంగా తప్పకుండా చేస్తామో అదే విధంగా వర్కవుట్(Workout) చేయాలి. దీనికోసం కష్టపడాలి. అల్లు అర్జున్(Allu Arjun) వారానికి ఏడెనిమిది సెషన్లు వర్కవుట్ చేయడానికి కేటాయిస్తున్నాడు. ఒక్కోసారి నాలుగు సెషన్లు కూడా పూర్తవుతాయి. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎనిమిది సెషన్లలో పని చేయడం మంచిది.

ఫిట్‌గా ఉండడమంటే కేవలం వర్కవుట్ చేయడమే కాదు. దీనితో పాటు, సరైన ఆహారాన్ని(Food) అనుసరించడం కూడా చాలా ముఖ్యం. అల్లు అర్జున్ హెల్తీ డైట్‌(Health Diet)ని ఫాలో అవుతున్నాడు. చాలా పండ్లు, కూరగాయలు తీసుకుంటాడు. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఎక్కువగా బార్ చాక్లెట్లు తింటారు. అల్లు అర్జున్ ఇంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడం వల్లే ఈ వయసులో కూడా ఫిట్ గా ఉండే అవకాశం ఉంది.

WhatsApp channel