Celebrities Ugadi Celebrations: అల్లు అర్జున్, యశ్ ఇళ్లలో ఉగాది సంబరాలు చూశారా?-celebrities ugadi celebrations as allu arjun and yash celebrated the festival ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Celebrities Ugadi Celebrations: అల్లు అర్జున్, యశ్ ఇళ్లలో ఉగాది సంబరాలు చూశారా?

Celebrities Ugadi Celebrations: అల్లు అర్జున్, యశ్ ఇళ్లలో ఉగాది సంబరాలు చూశారా?

Hari Prasad S HT Telugu

Celebrities Ugadi Celebrations: అల్లు అర్జున్, యశ్ ఇళ్లలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. అటు యశ్ భార్య రాధిక, ఇటు అల్లు అర్జున్ భార్య స్నేహ ఆ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

భార్య రాధికా పండిట్ తో యశ్ ఉగాది సంబరాలు

Celebrities Ugadi Celebrations: ఉగాది సంబరాలను బుధవారం (మార్చి 22) తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. షడ్రచుల పచ్చడితో పండగ చేసుకున్నారు. పంచాంగ శ్రవణాలతో తమ భవిష్యత్తు గురించి తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఉగాది సంబరాలను సెలబ్రిటీలు కూడా ఘనంగా జరుపుకున్నారు.

ఇటు అల్లు అర్జున్ కుటుంబం, అటు కన్నడ నాట కేజీఎఫ్ స్టార్ యశ్ కుటుంబం కూడా కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పారు. సెలబ్రిటీల ఇళ్లలో పండగ ఎలా జరుపుకుంటారో తెలుసుకోవాలన్న ఆరాటం అభిమానులకు ఉంటుంది. అందుకే తమ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సెలబ్రిటీలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఉగాది సెలబ్రేషన్స్ కు సంబంధించి కూడా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ తమ ఇంట్లో ఉగాది సంబరాల వీడియోను షేర్ చేసింది. పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఆమె ఉగాది జరుపుకుంది. పచ్చడి తయారీ నుంచి ఎన్నో పిండి వంటలు, కొత్త బట్టలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉగాది శుభాకాంక్షలు అటూ ఆమె ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. మరోవైపు కన్నడ స్టార్ యశ్ ఇంట్లో కూడా ఉగాది సంబరాలు జరిగాయి. ఈ ఫొటోలను యశ్ భార్య రాధికా పండిట్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందరికి ఉగాది శుభాకాంక్షలు.. ఉగాది, యుగాది, గుడి పడ్వా, చైత్ర నవరాత్రి సందర్భంగా అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నాను అంటూ రాధికా ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.

ఉగాది వేడుకనే దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో ఉగాదిగా, కర్ణాటకలో చైత్ర నవరాత్రిగా, మహారాష్ట్రలో గుడి పడ్వాగా, పంజాబ్ లో బైశాఖి, కేరళలో విషుగా జరుపుకుంటారు.

సంబంధిత కథనం