Pushpa 2 New Poster: అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్.. పుష్పను చూస్తే పూనకాలే-allu arjun new poster from pushpa the rule movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 New Poster: అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్.. పుష్పను చూస్తే పూనకాలే

Pushpa 2 New Poster: అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్.. పుష్పను చూస్తే పూనకాలే

Maragani Govardhan HT Telugu
Apr 07, 2023 07:12 PM IST

Pushpa 2 New Poster: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం పుష్ప ది రూల్. ఈ సినిమా నుంచి మరో సరికొత్త పోస్టర్ విడుదలైంది. అమ్మోరు రూపంలో ఉన్న అల్లు అర్జున్ లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

పుష్ప2లో అల్లు అర్జున్
పుష్ప2లో అల్లు అర్జున్

Pushpa 2 New Poster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే వేల్ ఈజ్ పుష్ప అంటూ ఓ టీజర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 కాన్సెప్టు టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది విడుదలైన కాసేపటికే మన స్టైలిష్ స్టార్ పుష్ప 2 చిత్రానికి సంబంధించి మరో సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌గా మారింది.

ఈ పోస్టర్‌ను గమనిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే వచ్చేలా ఉన్నాయి. అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్ ఆకట్టుకుంటున్నాడు. గంగమ్మ తల్లి జాతరలో భాగంగా ఈ రూపంలో కనిపించినట్లు. పెద్ద పెద్ద కళ్లు, పెడలో నిమ్మకాయల దండ, ముక్కుకు ముక్కెర, చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, చీరను ధరించి అపర దుర్గమాతను తలపించాడు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఈ పోస్టర్‌తో ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో మూవీపై అంచాలను భారీగా పెరిగాయి. మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ డైలాగులను షేర్ చేశారు.

“గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేళ్ల కోతరా.. కత్తికి నెత్తుటి పూతరా... దేవతకైనా తప్పదు ఎర.. ఇది లోకం తలరాతరా” అనే మాటలను జోడించారు మేకర్స్. ఈ మాటలను చూస్తుంటే సినిమాలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్‌లో కనిపించినప్పుడు బ్యాక్ గ్రౌండ్ గీతంలో వచ్చే పదాల మాదిరిగా ఉన్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

IPL_Entry_Point