Allu Arjun Behindwoods Award: బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ ఇండియా అవార్డును అందుకున్న అల్లు అర్జున్
Allu Arjun Behindwoods Award: శనివారం చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ఐకాన్స్ అవార్డ్ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ అవార్డ్ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి.
Allu Arjun Behindwoods Award: అల్లు అర్జున్ (Allu Arjun) మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకున్నాడు.బిహైండ్‌వుడ్స్ గోల్డ్ఐకాన్స్ 2023 అవార్డు వేడుక శనివారం చెన్నైలో వైభవంగా జరిగింది. అవార్డ్ వేడుకకు అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ వేడుకలో బిగ్గెస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ ఇండియా అవార్డును అల్లు అర్జున్ అందుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
అంతే కాకుండా వేదికపై పుష్ప (Pushpa) సినిమాలోని శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. ఈ అవార్డు వేడుకలోకి స్టైలిష్‌గా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అంతే కాకుండా బిహైండ్‌వుడ్స్ గోల్డ్ ఐకాన్స్ అవార్డు వేడుకలో మణిరత్నం, లోకేష్‌కనకరాజ్, త్రిష, నయనతార, శింబు, రిషబ్‌శెట్టి, ఏఆర్ రెహమాన్‌తో పాటు పలువురు దక్షిణాది స్టార్స్ పాల్గొన్నారు.
బెస్ట్ హీరోగా శింబు, బెస్ట్ హీరోయిన్‌గా త్రిష(Trisha) అవార్డులను అందుకున్నారు. శింబుకు లోకేష్ కనకరాజ్ అవార్డును అందజేశారు. ఈ వేడుకలో పయనీర్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును లింగుసామి, సుధా కొంగరలతో కలిసి దిగ్గజ దర్శకుడు మణిరత్నానికి అల్లు అర్జున్ అందజేశారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2 సినిమా చేస్తోన్నాడు అల్లు అర్జున్.
ఈ పాన్ ఇండియన్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో పుష్ప -2 కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. పుష్ప-2తో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో పాన్ ఇండియన్ సినిమాకు ఇటీవలే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్.