Ragi Ambali : రాగి అంబలి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
Ragi Ambali : మన అమ్మమ్మలు చేసిన వంటకాల్లో అంబలి గురించి వినే ఉంటారు. దీనితో ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో ఇది తీసుకుంటే.. శరీరం చల్లగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోండి. అయితే రాగితో చేసే అంబలితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రాగి అంబలి ఒక ఆరోగ్యకరమైన వంటకం. ఇది రాగుల నుండి తయారవుతుంది. మీరు ఆరోగ్య ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదయం అల్పాహారంగా దీన్ని తీసుకోవచ్చు. ఇది మీ రోజుని ఆరోగ్యంగా ప్రారంభించడానికి సహాయం చేస్తుంది. రాగుల్లో ఫైబర్, ప్రొటీన్లు, కాల్షియం, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రాగులు అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని తయారీ కోసం.. రాగులను కొంత పరిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా ఎండబెట్టుకోవాలి. అనంతరం తర్వాత పొడి చేయాలి.
మెుదట ఒక గిన్నెలో నీళ్లు పోయాలి. రాగిపిండి కలిపి ఉండల్లేకుండా చేయాలి. అందులోనే బియ్యప్పిండి, సజ్జపిండి, జొన్నపిండి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత బాగా వేడి అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించాలి. కొంచెం చిక్కగా మారిన తర్వాత.. స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఉదయం పూట తీసుకుంటే చాలా బలంగా తయారవుతారు. వేసవిలో కడుపులో చల్లగా ఉంటుంది.
అంబలి తీసుకుంటే.. ఎండలతో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్, ఖనిజాలు, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. రాగి అంబలితో శరీరానికి చాలా బలం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. ఉదయం పూట రాగి అంబలి ఒక్క గ్లాస్ తాగినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
సంబంధిత కథనం