Shah Rukh hugs Kohli: కోహ్లిని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లి పఠాన్ డ్యాన్స్ చేయించిన షారుక్ ఖాన్-shah rukh hugs kohli and dances with him after kkr rcbb match is over ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shah Rukh Hugs Kohli: కోహ్లిని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లి పఠాన్ డ్యాన్స్ చేయించిన షారుక్ ఖాన్

Shah Rukh hugs Kohli: కోహ్లిని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లి పఠాన్ డ్యాన్స్ చేయించిన షారుక్ ఖాన్

Hari Prasad S HT Telugu

Shah Rukh hugs Kohli: కోహ్లిని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లి పఠాన్ డ్యాన్స్ చేయించాడు షారుక్ ఖాన్. గురువారం (ఏప్రిల్ 6) కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ తర్వాత విరాట్ ను షారుక్ ఆప్యాయంగా కౌగలించుకున్నాడు.

విరాట్ కోహ్లి, షారుక్ ఖాన్ డ్యాన్స్ (IPL)

Shah Rukh hugs Kohli: ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్ ను చూడటానికి కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియానికి వచ్చాడు. మ్యాచ్ మొత్తం స్టాండ్స్ లో ఉండి చూడటంతోపాటు.. ముగిసిన తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్ లో టీమ్ తో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

నాలుగేళ్ల తర్వాత ఈడెన్ లో కేకేఆర్ మ్యాచ్ జరగడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ మ్యాచ్ లో వెనుకబడినా శార్దూల్, రింకు సింగ్ పోరాటంతో అనూహ్యంగా పుంజుకొని భారీ స్కోరు చేసిన కేకేఆర్.. చివరికి 81 రన్స్ తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ సెర్మనీ దగ్గర కనిపించిన విరాట్ కోహ్లిని పరుగెత్తుకుంటూ వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు షారుక్ ఖాన్.

అంతేకాదు అతనితో పఠాన్ మూవీ పాటపై స్టెప్పులు వేయించే ప్రయత్నం చేశాడు. విరాట్ భుజంపై చేయి వేసి ఝూమే జో పఠాన్ సాంగ్ స్టెప్పులు చూపించాడు షారుక్. అయితే కోహ్లి మాత్రం ఆ స్టెప్పులు తనతో కాదని తప్పుకున్నాడు. అయితే విరాట్ ను షారుక్ ఎంతో ఆప్యాయంగా పలకరించిన ఫొటోలు, వీడియోలు మాత్రం వైరల్ అయ్యాయి.

ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో తన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. టీమ్ ఆంథెమ్ కూడా పాడారు. ప్లేయర్స్ తో కలిసి షారుక్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్ హీరో శార్దూల్ ఠాకూర్ భుజంపై చేయి వేసి వాళ్లతో కలిసి టీమ్ ఆంథెమ్ సాంగ్ పాడటం విశేషం. ఈ మ్యాచ్ లో శార్దూల్ కేవలం 20 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

దీంతో ఒక దశలో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ చివరికి 204 రన్స్ చేసింది. ఆ తర్వాత భారీ టార్గెట్ ను ఛేదించలేక ఆర్సీబీ కేవలం 123 రన్స్ కే ఆలౌటైంది. కేకేఆర్ స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి 4, సుయశ్ శర్మ 3, సునీల్ నరైన్ 2 వికెట్లు తీసుకున్నారు.

సంబంధిత కథనం