Jr NTR Remuneration: బాలీవుడ్ సినిమా కోసం రూ.100 కోట్లు అందుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్!-jr ntr remuneration is doubled for war 2 according to the reports ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Remuneration: బాలీవుడ్ సినిమా కోసం రూ.100 కోట్లు అందుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్!

Jr NTR Remuneration: బాలీవుడ్ సినిమా కోసం రూ.100 కోట్లు అందుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్!

Hari Prasad S HT Telugu

Jr NTR Remuneration: బాలీవుడ్ సినిమా కోసం రూ.100 కోట్లు అందుకుంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్. అతడు హిందీలో తొలిసారి హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Twitter)

Jr NTR Remuneration: ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అతనికి హిందీ బెల్ట్ లోనూ ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో తారక్ తో ఓ మల్టీ స్టారర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్ ఫిల్మ్ అయిన వార్ 2 కోసం ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ తో నటించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా.

తాజాగా ఈ మూవీ కోసం తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా ఆసక్తి రేపుతోంది. బాలీవుడ్ హంగామాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. వార్ 2 కోసం తారక్ ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అతడు రూ.45 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడా రెమ్యునరేషన్ ను రెట్టింపు కంటే కూడా ఎక్కువ చేసినట్లు ఆ ఎంటర్‌టైన్మెంట్ సైట్ వెల్లడించింది.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారమైతే లేదు. వార్ 2 మూవీలో తారక్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీలో హృతిక్ తో కలిసి అతడు చేయబోయే యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని కూడా సమాచారం. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన వార్ మూవీలో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు.

వార్ 2లో టైగర్ ప్లేస్ లో ఎన్టీఆర్ రానున్నాడు. నార్త్ నుంచి హృతిక్ రోషన్, సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో వార్ 2 అసలుసిసలైన పాన్ ఇండియా మూవీ కాబోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రిపుల్ ఆర్ మూవీలో భీమ్ పాత్ర హిందీ బెల్ట్ లోని ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అందులో తారక్ నటనకు ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు వార్ 2లో హృతిక్ రోషన్ లాంటి స్టార్ తో తారక్ చేతులు కలుపుతుండటంతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవడం ఖాయం. అందుకే ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత కథనం