NTR Movie with Hrithik: హృతిక్‌తో ఎన్టీఆర్ మల్టీ స్టారర్.. స్పై థ్రిల్లర్‌గా రానున్న చిత్రం!
NTR Movie with Hrithik: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. వీరిద్దరూ కలిసి వార్ 2 సీక్వెల్‌లో నటించబోతున్నారని సమాచారం.
ANTR Movie wihh Hrithik: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR 30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగ్గా.. తారక్ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమాకు ఓకే చెప్పారు. ఇదిలా ఉంటే తారక్ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారట. బీటౌన్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ మూవీ చేయనున్నారట.
హృతిక్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ వార్(2019) చిత్రానికి సీక్వెల్‌గా రానున్న వార్-2 ఎన్టీఆర్ కీలక పాత్రలో మెరవనున్నారట. బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారట. హృతిక్ రోషన్ హీరోగా చేయనున్న ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర ఫేమ్మ అయ్యన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారట. అయితే తారక్ ఈ సినిమాలో నటిస్తున్నాడని నిర్ధారిస్థూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్(YRF) కూడా ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అయితే బీటౌన్‌లో మాత్రం ఈ వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. హిందీ ప్రేక్షకులను విపరీతంగా అలరించడానికి తారక్‌ను వార్-2లో తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా నిర్ధారించారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందే తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్‌లో సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్(2012), టైగర్ జిందా హై(2017) లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల తర్వాత హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి 2019లో వార్ అనే సినిమాలో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఈ చిత్ర సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.
సంబంధిత కథనం