Manoj Desai on War 2: వార్ -2లో ఎన్టీఆర్ బ‌దులు చ‌ర‌ణ్ పేరు - నంద‌మూరి, మెగా ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెట్టిన మ‌నోజ్ దేశాయ్-manoj desai interesting comments war 2 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Manoj Desai Interesting Comments War 2 Movie

Manoj Desai on War 2: వార్ -2లో ఎన్టీఆర్ బ‌దులు చ‌ర‌ణ్ పేరు - నంద‌మూరి, మెగా ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెట్టిన మ‌నోజ్ దేశాయ్

Nelki Naresh Kumar HT Telugu
Apr 14, 2023 09:52 AM IST

Manoj Desai on War 2: వార్ 2లో ఎన్టీఆర్ బ‌దులుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడంటూ ముంబైలోని గెలాక్సీ థియేట‌ర్ ఓన‌ర్ మ‌నోజ్ దేశాయ్ చేసిన కామెంట్స్ మెగా, నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ధ్య వార్‌కు దారితీశాయి.

ఎన్టీఆర్,రామ్‌చ‌ర‌ణ్
ఎన్టీఆర్,రామ్‌చ‌ర‌ణ్

Manoj Desai on War 2: వార్ -2లో హీరోగా ఎన్టీఆర్ (Ntr) బ‌దులు రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) పేరును ముంబ‌యిలోని గెలాక్సీ థియేట‌ర్ ఓన‌ర్ మ‌నోజ్ దేశాయ్ పేర్కొన‌డం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. వార్‌-2 సినిమాతో టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా ఈ సినిమాను నిర్మించేందుకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ స‌న్నాహాలు చేస్తోంది. కాగా వార్ 2 సినిమాపై ముంబయిలోని గెలాక్సీ థియేట‌ర్ ఓన‌ర్‌, సీనియ‌ర్ ఎగ్జిబిట‌ర్ మ‌నోజ్ దేశాయ్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బ‌దులు రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడంటూ అత‌డు పేర్కొన‌డంతో నంద‌మూరి, మెగా ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు రేపుతోంది.

హృతిక్ రోష‌న్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ వార్ 2 సినిమా చేస్తే బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌తో పాటు సౌత్‌లో హిందీ సినిమాల మార్కెట్ పెరుగుతుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ దేశాయ్ పేర్కొన్నాడు. వార్ -2లో ఎన్టీఆర్ హీరోగా ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ పేరు బ‌దులు చ‌ర‌ణ్ పేరును మ‌నోజ్ దేశాయ్ చెప్ప‌డం హాట్ టాపిక్‌గా మారింది.

అత‌డు కావాల‌నే అలా చెప్పాడా? లేదంటే ఎన్టీఆర్ పేరును మ‌ర్చిపోయాడా అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది. అత‌డి కామెంట్స్‌పై వార్ 2లో ఎన్టీఆర్ కంటే చ‌ర‌ణ్ బెస్ట్ అని మ‌నోజ్ దేశాయ్ అన్నాడంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేయ‌డం మొద‌లుపెట్టారు. మ‌రోవైపు ఎన్టీఆర్‌ను కించ‌ప‌రిచాడంటూ మ‌నోజ్ దేశాయ్‌ని నంద‌మూరి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తోన్నారు. ఇరువురి హీరోల అభిమానులు ట్విట్ట‌ర్‌లో మాట‌ల యుద్ధానికి దిగారు.

అభిమానులు చేసిన ప‌లు ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. కాగా ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్‌లో త‌మ మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ప‌లు మార్లు పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ త‌ర్వాత ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ త‌లో రెండు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

IPL_Entry_Point

టాపిక్