NTR Perfect Planning: సమయం లేదు మిత్రమా.. గ్యాప్ లేకుండా ఫుల్ బిజీ.. ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ప్లానింగ్
NTR Perfect Planning: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొరటాలతో సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమాను పట్టాలెక్కించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులయ్యే సమయంలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.
NTR Perfect Planning: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవలే ఘనంగా లాంచ్ అయింది. తారక్ సెట్స్‌లో కూడా అడుగుపెట్టేశారు. ఇదిలా ఉంటే ఆయన త్వరలో బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. వార్-2 సీక్వెల్‌లో హృతిక్‌తో మల్టీ స్టారర్ చేయనున్నారని బీటౌన్ మీడియా సమాచారం. దీంతో ప్రశాంత్ నీల్‌తో చేయనున్న సినిమాపై సందిగ్ధత నెలకొంది. ఈ మూవీ ఉంటుందా? లేదా? అనే సందేహాలు తలెత్తాయి. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ కారణంగా ఏడాది పాటు సినిమాలేవి చేయని ఎన్టీఆర్.. ఇకపై వరుస పెట్టి మూవీస్ చేయాలని ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఆయన కొరటాల మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 30లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమాకు సిద్ధమవుతారట. అయితే ఆయన ప్రభాస్ సలార్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 28న విడుదల కానుంది. దీంతో ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారట. విదేశాల్లో ఈ పనులను మొదలుపెట్టనున్నారని సమాచారం.
అంతేకాకుండా ప్రశాంత్ నీల్‌కు ఈ సినిమాకు సంబంధించిన లోకేషన్లు, ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఆరు నెలల సమయం పట్టనుందట. అంతవరకు తారక్ బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయ్యన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్-2 సీక్వెల్‌లో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.
వార్-2లో ఎన్టీఆర్ పోర్షన్ పూర్తి చేయడానికి మూడు నెలల సమయం సరిపోతుందని తెలుస్తోంది. అక్టోబరులో తారక్ చిత్రీకరణలో పాల్గొంటారట. జనవరిలోపు ఆయన భాగాన్ని చిత్రీకరణ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోపకక్ ఇదే సమయానికి ప్రశాంత్ నీల్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి కేజీఎఫ్ డైరెక్టర్‌తో పనిచేయనున్నారు. దీంతో తారక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ కానున్నారు.
ఆర్ఆర్ఆర్ కారణంగా ఆలస్యమైన సమయాన్ని తారక్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో కవర్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంక సమయాన్ని వృథా చేయకూడదనే తలంపుతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరోపక్క ఎన్టీఆర్ ప్లాన్ చూసి ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.