Chiranjeevi New Car: కొత్త కారు కొన్న చిరంజీవి.. ఆ నంబర్ కోసమే రూ.4.7 లక్షల ఖర్చు-chiranjeevi new car is toyota vellfire and it costs over one crore ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi New Car: కొత్త కారు కొన్న చిరంజీవి.. ఆ నంబర్ కోసమే రూ.4.7 లక్షల ఖర్చు

Chiranjeevi New Car: కొత్త కారు కొన్న చిరంజీవి.. ఆ నంబర్ కోసమే రూ.4.7 లక్షల ఖర్చు

Hari Prasad S HT Telugu
Apr 12, 2023 09:34 PM IST

Chiranjeevi New Car: కొత్త కారు కొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ కారు ఫ్యాన్సీ నంబర్ కోసమే రూ.4.7 లక్షల ఖర్చు చేయడం విశేషం. ఆ లెక్కన కారుకు ఎంత పెట్టాడో అనే కదా మీ డౌట్.

చిరంజీవి కొన్న కొత్త కారు ఈ మోడలే
చిరంజీవి కొన్న కొత్త కారు ఈ మోడలే

Chiranjeevi New Car: వరుసగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో మాంచి ఊపు మీదున్నాడు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడంతో చిరు.. అదే ఉత్సాహంలో కొత్త కారు కొన్నాడు. ఈ కారు పేరు టొయోటా వెల్‌ఫైర్. దీని ఖరీదు రూ.1.2 కోట్లు. అయితే ఈ కారుకు ఫ్యాన్సీ నంబర్ అయిన 1111 కోసమే చిరంజీవి మరో రూ.4.5 లక్షలు ఖర్చు చేయడం విశేషం.

ఈ కొత్త కారుకు టీఎస్09 జీబీ 1111 అనే నంబర్ కేటాయించారు. నిజానికి చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ సహా ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ఆ కార్లన్నింటికీ ఇదే ఫ్యాన్సీ నంబర్ ఉంది. ప్రతీసారీ ఈ నంబర్ కోసమే చిరంజీవి భారీగా ఖర్చు చేస్తుంటాడు. గతంలో చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ రూ.3.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

చిరు దగ్గర టొయోటా లాండ్ క్రూజర్ కారు కూడా ఉంది. దీని విలువ కూడా రూ.1.5 కోట్లకుపైనే ఉంటుంది. మూడేళ్ల కిందట మార్కెట్ లోకి వచ్చిన ఈ టొయోటా వెల్‌ఫైర్ కు సెలబ్రిటీలు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కారులో కనిపించాడు. స్టైలిష్ లుక్ తోపాటు ఇందులోని అత్యాధునిక ఫీచర్లు సెలబ్రిటీలను ఆకర్షిస్తున్నాయి.

ఇక చిరంజీవి విషయానికి వస్తే గతేడాది ఆచార్య మూవీ డిజాస్టర్ తో ఢీలా పడినట్లు కనిపించినా.. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్లతో మళ్లీ గాడిలో పడ్డాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ తో భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు.

సంబంధిత కథనం