Chiranjeevi Next Movie Update: యంగ్ డైరెక్టర్‌తో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్.. క్రేజీ కాంబినేషన్‌ కన్ఫార్మ్..!-megastar chiranjeevi next movie with bimbisara director vasishta ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Next Movie Update: యంగ్ డైరెక్టర్‌తో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్.. క్రేజీ కాంబినేషన్‌ కన్ఫార్మ్..!

Chiranjeevi Next Movie Update: యంగ్ డైరెక్టర్‌తో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్.. క్రేజీ కాంబినేషన్‌ కన్ఫార్మ్..!

Chiranjeevi Next Movie Update: మెగాస్టార్ చిరంజీని తన తదుపరి సినిమాను ఓ యువ దర్శకుడితో చేయనున్నారట. బింబిసారతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యువ డైరెక్టర్ వశిష్టతో ఆయన పనిచేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.

బింబిసార డైరెక్టర్‌తో మెగాస్టార్ చిత్రం

Chiranjeevi Next Movie Update: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి విజయాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. గతేడాది ఆచార్య మిగిల్చిన పరాజయం నుంచి వేగంగానే కొలుకోని గాడ్ ఫాదర్‌తో మంచి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత సంక్రాంతికి వాల్తేరు వీరయ్య చిత్రంతో మంచి మాస్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం బోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న మన మెగాస్టార్.. తన తదుపరి ప్రాజెక్టును ఇంతవరకు ప్రకటించలేదు. ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు కథలను విన్న ఆయనకు అవి పెద్దగా నచ్చలేదు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టుపై సందిగ్ధత నెలకొంది.

తాజాగా మెగాస్టార్.. ఓ యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అతడేవరో కాదు.. బింబిసారతో గతేడాది కల్యాణ్ రామ్‌కు సూపర్ హిట్ అందించిన వశిష్ట‌కు మెగాస్టార్ ఓకే చెప్పారట. బింబిసారతో ప్రేక్షకాదరణ పొందిన వశిష్ట చెప్పిన కథ.. చిరంజీవికి నచ్చడంతో అతడితో మూవీకి ఓకే చెప్పేశారట. ఈ స్క్రిప్టుకు మెగాస్టార్‌కు బాగా నచ్చిందని వినికిడి.

వశిష్టతో చేయబోయే సినిమా త్వరలోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో భోళా శంకర్ చిత్రంతో చిరు సందడి చేయనున్నారు. కాబట్టి ఈ చిత్రం విడుదలైన తర్వాత బింబిసార దర్శకుడితో మూవీని పట్టాలెక్కించనున్నారు మన మెగాస్టార్. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన రానుంది.

ఈ ఏడాది చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ దక్కించుకోవడంతో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.