Waltair Veerayya Success Celebrations: భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్.. మెగాస్టార్ సందడి-chiranjeevi waltair veerayya success celebrations in bhola shankar sets
Telugu News  /  Entertainment  /  Chiranjeevi Waltair Veerayya Success Celebrations In Bhola Shankar Sets
భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్
భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్

Waltair Veerayya Success Celebrations: భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్.. మెగాస్టార్ సందడి

19 January 2023, 18:33 ISTMaragani Govardhan
19 January 2023, 18:33 IST

Waltair Veerayya Success Celebrations: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను భోళా శంకర్ సెట్స్‌లో జరిపారు.

Waltair Veerayya Success Celebrations: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. వరుస హిట్లను అందుకున్న మన మెగాస్టార్ తన తదుపరి ప్రాజెక్టుతో బిజీగా మారారు. గత అక్టోబరులో గాడ్‌ఫాదర్ సక్సెస్‌తో హిట్ అందుకున్న చిరు.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో సూపర్ సక్సెస్‌ను సాధించారు. ఇదే సమయంలో తన తదుపరి ప్రాజెక్టుతో బిజీ అయిపోయారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సెలబ్రేషన్స్ జరిగాయి.

భోళా శంకర్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య చిత్ర సక్సెస్‌ను సెలబ్రేట్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు ఆయన కూడా ఆ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా కేకు కట్ చేసి భోళా శంకర్ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్‌కు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య టీమ్‌కు బోళా శంకర్ చిత్రబృందం శుభాకాంక్షలు చెప్పింది.

వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న చిత్రం భోళా శంకర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా.. చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇందులో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. కీర్తి.. మెగాస్టార్‌కు సోదరి పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరు కాకుండా మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెహర్ రమేష్ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్
వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్

సంబంధిత కథనం