Pushpa 2 Intervel Scene: 35 రోజులు ఒకే సీన్ షూటింగ్.. పుష్ప 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్-pushpa 2 intervel scene going to be the highlight of the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa 2 Intervel Scene Going To Be The Highlight Of The Movie

Pushpa 2 Intervel Scene: 35 రోజులు ఒకే సీన్ షూటింగ్.. పుష్ప 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Hari Prasad S HT Telugu
Apr 27, 2023 09:22 PM IST

Pushpa 2 Intervel Scene: 35 రోజులు ఒకే సీన్ షూటింగ్ చేశారట. పుష్ప 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సుకుమార్.. ఏ విషయంలోనూ అసలు కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు.

పుష్ప2 లో అల్లు అర్జున్
పుష్ప2 లో అల్లు అర్జున్

Pushpa 2 Intervel Scene: పుష్ప మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్ అయిన తర్వాత ఆ మూవీ సీక్వెల్ పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ కేజీఎఫ్ 2 ఊహకందని విజయం సాధించడం కూడా పుష్ప 2 మేకర్స్ పై ఒత్తిడి పెంచింది. ఫస్ట్ పార్ట్ కంటే సీక్వెల్ మరింత గొప్పగా ఉండాల్సిందే అని మేకర్స్ భావిస్తున్నారు.

దీంతో టైమ్ కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నా సరే పుష్ప 2 ప్రీప్రొడక్షన్ వర్క్ నుంచి షూటింగ్ వరకూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా డైరెక్టర్ సుకుమార్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మధ్యే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో అల్లు అర్జున్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే మూవీలో ఇంటర్వెల్ సీన్ సందర్భంగా అల్లు అర్జున్ ఈ గెటప్ లో కనిపిస్తాడని లేటెస్ట్ బజ్ చెబుతోంది. ఇక ఈ ఇంటర్వెల్ సీన్ మూవీలోనే హైలైట్ గా నిలవనుందట. దీంతో ఈ సీక్వెన్స్ ను అద్బుతంగా చిత్రీకరించాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నాడు. ఈ ఇంటర్వెల్ సీనే 35 రోజుల పాటు తీయడం విశేషం.

సినిమాలో ఇదే కీలకమైన సీన్ కానుంది. అల్లు అర్జున్ ఈ లుక్ కోసమే ప్రతి రోజూ సుమారు 3 గంటల పాటు మేకప్ చేయాల్సి వచ్చిందంటే మేకర్స్ ఎంత కచ్చితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ యాక్షన్ సీక్వెన్స్ కు అనుకున్నదాని కంటే కూడా ఎక్కువ సమయం పడుతోందని మూవీ వర్గాలు వెల్లడించాయి.

పుష్ప: ది రూల్ టీజర్ కు ఇప్పటికే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దీంతో సినిమాను ఆ స్థాయిలో అందించడానికి మేకర్స్ చాలానే శ్రమించాల్సి వస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

IPL_Entry_Point