Madhubala on Shaakuntalam: బాహుబలి, ఆర్ఆర్ఆర్ హిట్ అయ్యాయి కదా.. మధుబాల షాకింగ్ కామెంట్స్-madhubala on shaakuntalam failure says hurt with result ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Madhubala On Shaakuntalam Failure Says Hurt With Result

Madhubala on Shaakuntalam: బాహుబలి, ఆర్ఆర్ఆర్ హిట్ అయ్యాయి కదా.. మధుబాల షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Apr 26, 2023 09:01 PM IST

Madhubala on Shaakuntalam: బాహుబలి, ఆర్ఆర్ఆర్ హిట్ అయ్యాయి కదా, అందులో లాజిక్ ఏముంది అంటూ మధుబాల షాకింగ్ కామెంట్స్ చేసింది. శాకుంతలం మూవీ ఫెయిల్యూర్ తనకెంతో బాధ కలిగించిందని చెప్పింది.

నటి మధూ
నటి మధూ (Sunil Khandare)

Madhubala on Shaakuntalam: వెటరన్ నటి మధుబాల ఈ మధ్య పేరు మార్చుకొని మధూ అయింది. ఈమె రీసెంట్ గా వచ్చిన శాకుంతలం మూవీలో మేనక పాత్ర పోషించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడటం ఆమెకు మింగుడు పడటం లేదు. శాకుంతలం మూవీని బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో పోలుస్తూ.. అవి బాగా ఆడినప్పుడు శాకుంతలం ఎందుకు ఫెయిలైందో అర్థం కావడం లేదని చెప్పింది.

శాకుంతలం సినిమా కోసం మేకర్స్ అందరూ చాలా కష్టపడ్డారని, చివరికి ఈ మూవీ ఫెయిలవడం ఎంతగానో బాధ కలిగించిందని మధూ అన్నది. "శాకుంతలం ఫెయిల్యూర్ నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఈ మూవీ కోసం మేకర్స్, ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు. ప్రీప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకూ సినిమాను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదు. షూటింగ్, డబ్బింగ్ తర్వాత ఏడాది పాటు కేవలం గ్రాఫిక్స్ పైనే పని చేశారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించడానికి చాలా శ్రమించారు. షూటింగ్ సమయంలోనూ ఆర్టిస్టులు, టెక్నీషియన్లపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు" అని మధూ చెప్పింది.

"శాకుంతలంలో పురాణాలతోపాటు బలమైన సౌతిండియా ఫ్లేవర్ ఉంది. బాహుబలి నడిచింది. ఆర్ఆర్ఆర్ నడిచింది. కొన్ని సినిమాలు బాగా ఆడతాయి, కొన్ని ఆడవు.. ఇందులో లాజిక్ అంతుబట్టదు. బాహుబలి అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. సినిమా బాగున్నా అంత హిట్ ఊహించలేదు. శాకుంతలం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుందని అసలు ఊహించలేదు. ఇది చాలా బాధగా ఉంది" అని మధూ తెలిపింది.

శాకుంతలం సినిమా కోసం మేకర్స్ చాలా డబ్బు, సమయం కేటాయించినా.. ఈ మూవీ ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా గుణశేఖర్ ఈ సినిమాను తీసిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం