Shaakuntalam Collections: శాకుంతలం డిజాస్టర్.. ఎంత నష్టమో తెలుసా?-shaakuntalam collections confirms the movie is a disaster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam Collections: శాకుంతలం డిజాస్టర్.. ఎంత నష్టమో తెలుసా?

Shaakuntalam Collections: శాకుంతలం డిజాస్టర్.. ఎంత నష్టమో తెలుసా?

Hari Prasad S HT Telugu
Apr 17, 2023 02:50 PM IST

Shaakuntalam Collections: శాకుంతలం డిజాస్టర్ గా నిలిచిపోనుంది. మేకర్స్ కు ఈ సినిమా భారీ నష్టాలనే మిగిల్చింది. తొలి వీకెండ్ ముగిసే సరికే చాలా థియేటర్ల నుంచి ఈ మూవీని తీసేశారు.

సమంత
సమంత

Shaakuntalam Collections: ఎన్నో రోజులుగా ఊరిస్తూ వచ్చి మొత్తానికి గత శుక్రవారం (ఏప్రిల్ 14) రిలీజైన శాకుంతలం మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇదొక డిజాస్టర్ గా మిగిలిపోనుంది. సమంతలాంటి టాప్ హీరోయిన్ నటించిన ఈ సినిమా కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. తొలి వీకెండ్ ముగిసిందో లేదో ఏపీలో చాలా చోట్ల ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేయడం గమనార్హం.

ఈ మూవీ తొలి మూడు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.10 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ కేవలం రూ.4.2 కోట్లు. రూ.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన శాకుంతలం భారీ నష్టాలనే మిగిల్చింది. మేకర్స్ కనీసం రూ.14 కోట్లు అయినా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో రోజురోజుకూ ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి.

రెండో రోజే లారెన్స్ రాఘవ మూవీ రుద్రుడు కూడా శాకుంతలం కలెక్షన్లను దాటేసింది. ఇక మూడో రోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి శాకుంతలం మూవీ రూ.2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సమంతలాంటి హీరోయిన్ కు ఈ కలెక్షన్లు మరీ దారుణమనే చెప్పాలి. ఈ సినిమాను గుణశేఖర్ తీసిన విధానంపై చాలా విమర్శలు వచ్చాయి.

ఓ తెలుగు సీరియల్ లాగా ఉందని కూడా కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ నెగటివ్ పబ్లిసిటీ శాకుంతలం కలెక్షన్లపైనా ప్రభావం చూపింది. అసలు చాలా థియేటర్లలో ఈ మూవీ రెండో వారంలోకి కూడా అడుగుపెట్టడం అనుమానంగా మారింది. ఈ సినిమా కోసం గుణశేఖర్ సుమారు రూ.50 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కాకుండా 3డీ వెర్షన్, ప్రమోషన్ల కోసం మరో రూ.10 కోట్ల వరకూ ఖర్చయ్యాయి.

ఇంత ఖర్చు పెట్టి చివరికి పేలవమైన కలెక్షన్లతోపాటు అటు సమంత అభిమానుల నుంచి కూడా గుణశేఖర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో మరో నాలుగు భాషల్లో రిలీజ్ చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఉత్తరాదిలో అయితే అసలు ఈ సినిమాను ఎవరూ పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం