Rudrudu OTT platform: లారెన్స్ రుద్రుడు ఓటీటీలోకి వచ్చేది అప్పుడే - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్
Rudrudu OTT platform: లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే...
Rudrudu OTT Release Date: రుద్రుడు సినిమాతో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు లారెన్స్(Lawrence). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మే నెల సెకండ్ వీక్‌లో రుద్రుడు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకున్నది. మే 12 లేదా 19లలో ఏదో ఒక తేదీన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. మే ఫస్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. రుద్రుడు సినిమాకు కతిరేశన్ దర్శకత్వం వహించాడు.
ఇందులో లారెన్స్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్‌గా నటించింది. శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించాడు. తమిళంలో రుద్రన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను రుద్రుడు పేరుతో సీనియర్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు తెలుగులో రిలీజ్ చేశారు.
రుద్రుడు కథేమిటంటే....
ఇందులో రుద్ర అనే ఐటీ ఉద్యోగిగా లారెన్స్ కనిపించాడు. రుద్ర కుటుంబంపై పగను పెంచుకున్న భూమి (శరత్ కుమార్) అనే రౌడీ షీటర్ అతడి తల్లితో (పూర్ణిమ) పాటు భార్యను (ప్రియా భవానీ శంకర్) హత్య చేస్తాడు.
అందుకు గల కారణమేమిటి? భూమిపై రుద్ర ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడనే కథాంశంతో రుద్రుడు సినిమా తెరకెక్కింది. మాస్ ప్రేక్షకుల అభిరుచులను తగ్గట్లుగా హై ఇంటెన్స్ యాక్షన్ అంశాలతో దర్శకుడు కతిరేషన్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో మూడు రోజుల్లో ఈ సినిమా రెండు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.