Raghava Lawrence Rudhrudu Release: లారెన్స్ నటించిన రుద్రుడు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?-raghava lawrence starred rudhrudu movie releasing worldwide grandly on april 14 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Raghava Lawrence Starred Rudhrudu Movie Releasing Worldwide Grandly On April 14

Raghava Lawrence Rudhrudu Release: లారెన్స్ నటించిన రుద్రుడు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Mar 04, 2023 06:05 PM IST

Raghava Lawrence Rudhrudu Release: రాఘవ లారెన్స్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం రుద్రుడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రుద్రుడు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
రుద్రుడు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence Rudhrudu Release: నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శుకుడిగా, సంగీత దర్శకుడిగా ఇలా పలు విభాగాల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ఆయన కథానాయకుడిగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి హీరోగా ఆడియెన్స్‌ను పలకరించేందుకు వస్తున్నారు. కతిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.

లారెన్స్ నటించిన రుద్రుడు చిత్రాన్ని 2023 ఏప్రిల్ 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమా థియేటర్లలో విడుదలయ్యే సమయానికి వేసవి సెలవులు కూడా వస్తాయని, అందుకే సమ్మర్ హాలీడేస్‌ను క్యాష్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుందీ చిత్రం.

లారెన్స్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథోనీ, స్టంట్స్ శివ-విక్కీ. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

IPL_Entry_Point