Vishwak Das ka Dhamki: ఆహాలో దుమ్మురేపుతోన్న ధమ్కీ.. ఓటీటీలో మూవీకి భారీ రెస్పాన్స్-vishwak sen das ka dhamki movie got super response in aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vishwak Sen Das Ka Dhamki Movie Got Super Response In Aha

Vishwak Das ka Dhamki: ఆహాలో దుమ్మురేపుతోన్న ధమ్కీ.. ఓటీటీలో మూవీకి భారీ రెస్పాన్స్

Maragani Govardhan HT Telugu
Apr 16, 2023 10:26 PM IST

Vishwak Das ka Dhamki: విశ్వక్ సేన్ నటించిన సరికొత్త చిత్రం దాస్ కా ధమ్కీ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి విపరీతంగా రెస్పాన్స్ వస్తోంది.

విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ
విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ

Vishwak Das ka Dhamki: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ గత నెలలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లను సాధించింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్కడ కూడా ఈ చిత్రాన్ని ఆడియెన్స్ విపరీతంగా చూస్తున్నారు.

ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న దాస్ కా ధమ్కీ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడ విడుదలైన 48 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆహాలో ట్రెండ్ అవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే తరహా ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ డ్యూయల్ రోల్‌లో అదరగొట్టాడు.

థియేటర్లలో ఈ మూవీ మొదటి రెండు రోజుల్లోనే 14 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తొలి రెండు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. విశ్వక్ విభిన్న నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

దాస్ కా ధమ్కీ చిత్రంలో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ నటించింది. వీరితో పాటు రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

IPL_Entry_Point

టాపిక్