Das Ka Dhamki day 2 Collections: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న విశ్వక్.. రెండో రోజు కూడా అదిరిపోయే వసూళ్లు..!-das ka dhamki collects approximatly 13 crore which is the highest grosser for vishwak sen ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Das Ka Dhamki Collects Approximatly 13 Crore Which Is The Highest Grosser For Vishwak Sen

Das Ka Dhamki day 2 Collections: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న విశ్వక్.. రెండో రోజు కూడా అదిరిపోయే వసూళ్లు..!

Maragani Govardhan HT Telugu
Mar 24, 2023 05:34 PM IST

Das Ka Dhamki day 2 Collections: విశ్వక్ సేన్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం దాస్ కా ధమ్కీ. తాజాగా ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో అదరగొడుతోంది. విడుదలైన రెండో రోజే ఈ సినిమా దాదాపు 4 కోట్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

దాస్ కా ధమ్కీకలెక్షన్లు
దాస్ కా ధమ్కీకలెక్షన్లు

Das Ka Dhamki day 2 Collections: ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి చాలా మంది విభిన్న తరహాలో తమ వంతు కృషి చేస్తుంటారు. అయితే ఎవరు, ఎప్పుడు, ఎలా అవుతారనేది చెప్పడం కాష్టం. ముఖ్యంగా సినిమా హిట్ కావడం కోసం విభిన్న రకాల ఫార్మూలాలను వాడతారు. కానీ అల్టీమేట్‌గా ప్రేక్షకులను ఆదరిస్తేనే విజయం సొంతమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా సినిమా కోసం తీవ్రంగా కష్టపడి, తనదైన పబ్లిసిటీ, హార్డ్ వర్క్‌తో సినిమాను ప్రమోట్ చేస్తాడు. కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ మొత్తానికి సక్సెస్ అయితే అందుకుంటున్నాడు. ఇటీవలే ఆయన నటించన దాస్ కా ధమ్కీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తొలి రోజే కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లను సాధించిన విశ్వక్.. రెండో రోజు కూడా అదే తరహా వసూళ్లను సాధించాడు.

విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం తొలి రోజు అత్యధికంగా దాదాపు రూ.9 కోట్ల వసూళ్లను సాధించిందట. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిందీ చిత్రం. ఈ సినిమా రెండో రోజు రూ. 4 కోట్లను రాబట్టిందని ట్రేడ్ పండితుల అంచనా. మొత్తానికి విశ్వక్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన దాస్ కా ధమ్కీ.. వీలైనంత త్వరలోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించేలా కనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ వీకెండ్ కూడా దాటలేదు. నాని దసరా మార్చి 30న విడుదలైతే తప్పా మిగిలిన ఏ సినిమాలు అతడికి పోటీలో లేవు. దీంతో ఈ సినిమాకు మరో వారం పాటు కలెక్షన్లు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి దాస్ కా ధమ్కీ బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షాన్ని కురిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దాస్ కా ధమ్కీ చిత్రంలో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ నటించింది. వీరితో పాటు రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

IPL_Entry_Point