Das ka Dhamki Twitter Review: విశ్వక్ 'దాస్ కా ధమ్కీ' ఎలా ఉంది? దమ్ము చూపించాడా?-here the vishwak sen movie das ka dhamki twitter review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Das Ka Dhamki Twitter Review: విశ్వక్ 'దాస్ కా ధమ్కీ' ఎలా ఉంది? దమ్ము చూపించాడా?

Das ka Dhamki Twitter Review: విశ్వక్ 'దాస్ కా ధమ్కీ' ఎలా ఉంది? దమ్ము చూపించాడా?

Maragani Govardhan HT Telugu
Mar 22, 2023 10:18 AM IST

Das ka Dhamki Twitter Review: టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన కొంతమంది ట్విటర్ వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు.

విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ
విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ

Das ka Dhamki Twitter Review: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సరికొత్త చిత్రం దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి. విశ్వక్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాది కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే పడ్డాయి. దీంతో సినిమా చూసినవాళ్లు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దాస్ కా ధమ్కీ కథేంటి? సినిమా ఎలా ఉంది? లాంటి విషయాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

దాస్ కా ధమ్కీ ఫస్టాఫ్ మాత్రం రొటీన్‌గా ఉంటుందని, ఓ చిన్న ట్విస్టుతో ఓ మాదిరిగా అనిపించిందని ఓ యూజర్ తన స్పందనను తెలియజేశాడు. కానీ సెకాండాఫ్‌కు వచ్చేసరికి మూవీ టెంపో, వరుస ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుందట. దీంతో ఓవరాల్‌గా సినిమాపై సానుకూల స్పందనైతే వస్తుంది. అభిమానులు మాత్రం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

విశ్వక్ సేన్ టేకింగ్, పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే నివేదా పేతురాజ్ గ్లామర్‌కు ఫిదా అవుతున్నారు. స్క్రీన్‌పై ఆమె చాలా అందంగా కనిపించిందట. మొత్తానికి సినిమా కొంచెం కొత్తదనంగా ఉందని అంటున్నారు. డ్యూయల్ రోల్‌లో విశ్వక్ బాగా పర్ఫార్మ్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

అలాగే కొంతమంది సినిమా నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఫస్టాఫ్ బోర్ కొడుతుందని, సెకండాఫ్‌లో ట్విస్టులు ఉన్నప్పటికీ అవి ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తాయని స్పందనను తెలియజేస్తున్నారు. మూవీలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఇబ్బంది పెడతాయని, అలాగే ఫస్టాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బాగుండేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కువగా పాజిటివ్ టాకే వినిపిస్తుంది. మొత్తానికి విశ్వక్ తన ఖాతాలో మరో హిట్‌ను వేసుకున్నాడని అంటున్నారు.

ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. ఇది విశ్వక్ మొదటి పాన్ ఇండియా చిత్రం.

Whats_app_banner

సంబంధిత కథనం