Almost Padipoyinde Pilla Video Song: ఆల్‌మోస్ట్ పడిపోయిందే పిల్లా వీడియో సాంగ్ రిలీజ్.. విశ్వక్ సేన్ స్టెప్పులు అదుర్స్
Almost Padipoyinde Pilla Video Song: విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం నుంచి ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా అనే పాట సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి పూర్తి పాట విడుదలైంది.
Almost Padipoyinde Pilla Video Song: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అశోక వనంలో అర్జున కల్యాణంలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అది కాకుండా ఓరీ దేవుడాతో మరో క్లాసిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవలే అతడు అతిథి పాత్ర పోషించిన ముఖ చిత్రం కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అతడు నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఆల్‌మోస్ట్ పడిపోయిందే పిల్ల అనే సాంగ్ చాట్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఫస్ట్ సింగిల్ ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్ల లిరికల్ వీడియోకు భారీగా స్పందన రావడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా వీడియో సాంగ్‌ను విడుదల చేసి ఆడియోన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను ఆదిత్య ఆర్కే ఆలపించాడు. పూర్ణాచారి సాహిత్యాన్ని సమకూర్చాడు.
విశ్వక్ సేన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆఖట్టుకున్నాడు. దాదాపు పాటంత విదేశీ లోకేషన్లలో చిత్రీకరించడంతో విజువల్‌గా సాంగ్ బాగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. నివేదా పేతురాజ్ తన అందంతో కుర్రాకారుకును ఉక్కిరిబిక్కిరి చేసింది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. యష్ మాస్టార్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌటైంది.
పాన్ఇండియా చిత్రంగా దాస్ కా ధమ్కీ రాబోతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.