Das Ka Dhamki Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చుంది. తాజాగా ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 22న విడుదల చేసేందుకు చిత్రబృంద సన్నాహాలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విశ్వక్ సేన్‌కు, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. విశ్వక్ సేన్ అద్భుతమైన నటుడంటూ కితాబిచ్చారు.,"విశ్వక్ సేన్ మాట్లాడినట్లు నేనెప్పటికీ మాట్లాడలేను. సాధారణంగా నేనే ఎక్కువగా మాట్లాడతానని అనుకుంటే నాకంటే అతడు ఎక్కువగా మాట్లాడతాడు. నా మూడ్ బాగోకపోతే నేను చూసే సినిమాల్లో విశ్వక్ నటించిన ఈ నగరానికి ఏమైంది తప్పక ఉంటుంది. అందులో ఓ నటుడిగా ఆయన కామెడీ చేయకుండానే నటించాడు. ఎంతగా ఎంటర్టైన్ చేస్తాడో అంతే బాధనూ లోపల దాచుకుని ఉంటాడు. అలా నటించాలంటే చాలా కష్టం. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ అతడు ప్రతిభావంతుడే." అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.,విశ్వక్ రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ అలరిస్తాడని తారక్ స్పష్టం చేశారు. "ఒకానొక సమయంలో ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేస్తున్నాడనుకున్నప్పుడు అశోక వనంలో అర్జున కల్యాణంతో వైవిధ్యం చూపించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేను వెళ్లాల్సి ఉంది. కానీ కుదర్లేదు. ఆ చిత్రం చూశా షాక్ అయ్యా. యాటిట్యూడ్‌తో మాట్లాడే మనిషి అందుకు పూర్తి భిన్నంగా సాఫ్ట్ క్యారెక్టర్‌లో ఒదిగిపోగలడా? అని అనిపించింది. ఆ మూసధోరణిలో నుంచి బయటకొచ్చేందుకు నాకు చాలా కాలం పట్టింది. 'అన్నా.. ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేశా.. ఈవెంట్‌కు మీరు రావాలంతే' అని నన్ను కలిసినప్పుడు విశ్వక్ అంటుంటే చాలా బాధేసింది." అని తారక్ తెలిపారు.,ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషించారురు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనుంది. ఇది విశ్వక్ మొదటి పాన్ ఇండియా చిత్రం. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమాను మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.,