Das Ka Dhamki OTT Release Date: దాస్ కా ధమ్కీ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ చేసిన ఆహా-das ka dhamki ott release date announced by aha on thursday april 6th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Das Ka Dhamki Ott Release Date Announced By Aha On Thursday April 6th

Das Ka Dhamki OTT Release Date: దాస్ కా ధమ్కీ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ చేసిన ఆహా

Hari Prasad S HT Telugu
Apr 06, 2023 06:31 PM IST

Das Ka Dhamki OTT Release Date: దాస్ కా ధమ్కీ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ చేసింది ఆహా ఓటీటీ. విశ్వక్‌సేన్ నటించిన ఈ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది.

దాస్ కా ధమ్కీ మూవీలో విశ్వక్‌సేన్
దాస్ కా ధమ్కీ మూవీలో విశ్వక్‌సేన్

Das Ka Dhamki OTT Release Date: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. ఈ మూవీ ఉగాది సందర్భంగా రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించింది. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు వారాల్లోనే ఈ సినిమా ఆహా ఓటీటీలోకి రాబోతోంది. రిలీజ్ డేట్ ను గురువారం (ఏప్రిల్ 6) ఆహా రివీల్ చేసింది.

ఆహాలో దాస్ కా ధమ్కీ మూవీ వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 14) నుంచి స్ట్రీమింగ్ కానుంది. విశ్వక్‌సేనే డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ ఫిమేల్ లీడ్ గా కనిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. దాస్ కా ధమ్కీ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించాడు. రావ్ రమేష్, హైపర్ ఆది, రోహిణి కీలకపాత్రలు పోషించారు.

ఈ మూవీలో విశ్వక్ డ్యుయల్ రోల్ పోషించాడు. ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన పాత్రలు. ఈ రెండింట్లోనూ అతడు తన యాక్టింగ్ తో మెప్పించాడు. కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కించాడు విశ్వ‌క్‌సేన్‌. ప్రేమ‌, వినోదం, మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు కొన్ని మ‌లుపుల్ని జోడించి ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని అనుకున్నారు. ఇందులో కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.

సంజ‌య్ రుద్ర అనే డాక్ట‌ర్‌గా, కృష్ణ‌దాస్ అనే వెయిట‌ర్‌గా రెండుపాత్ర‌ల్లో విశ్వ‌క్‌సేన్ చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో చెల‌రేగిపోయాడు. వెయిట‌ర్ పాత్ర‌లో కామెడీ టైమింగ్ బాగుంది. కీర్తిగా నివేథా పేతురాజ్ గ్లామ‌ర్‌తోపాటు యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించింది. మంచివాడిగా న‌టించే ఓ నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో రావుర‌మేష్ క‌నిపించారు. హీరో స్నేహితులుగా నాగ‌మ‌హేష్‌, హైప‌ర్ ఆది కామెడీ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యింది. లియోన్ జేమ్స్ మ్యూజిక్‌లో రెండు సాంగ్స్ బాగున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం