Shaakuntalam vs Rudrudu: రెండో రోజు సగానికి తగ్గిన శాకుంతలం కలెక్షన్స్ - సమంత సినిమాను దాటేసిన రుద్రుడు
Shaakuntalam vs Rudrudu: సమంత శాకుంతలం సినిమా వసూళ్లు రెండో రోజు దారుణంగా పడిపోయాయి. శాకుంతలం కంటే లారెన్స్ డబ్బింగ్ మూవీ రుద్రుడు ఎక్కువగా కలెక్షన్స్ దక్కించుకోవడం గమనార్హం.
lawrence rudrudu: శాకుంతలం సినిమా కలెక్షన్స్ రెండో రోజు భారీగా తగ్గాయి. నెగెటివ్ టాక్ ఎఫెక్ట్స్ కారణంగా సగానికిపైగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. తొలిరోజు కోటి పది లక్షలకుపైగా షేర్ రాబట్టిన ఈ సినిమాకు రెండో రోజు కేవలం యాభై లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు సమాచారం.
సమంత శాకుంతలంతో కంటే రాఘవ లారెన్స్ నటించిన డబ్బింగ్ సినిమా రుద్రుడు ఎక్కువగా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు. రుద్రుడు సినిమా శనివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో శాకుంతలం సినిమాకు ఆరు కోట్ల వరకు గ్రాస్, రెండు కోట్ల ఎనభై లక్షలకుపైగా షేర్ వచ్చినట్లు చెబుతోన్నారు.
మరోవైపు రుద్రుడు సినిమా రెండో రోజుల్లో రెండు కోట్ల ఎనభై లక్షలకుపైగా గ్రాస్, కోటి 30 లక్షలకుపైగా షేర్‌ను రాబట్టినట్లు సమాచారం. శాకుంతలం సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా త్రీడీలో ఈ సినిమాను రూపొందించారు.
శకుంతలగా సమంత నటించగా దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ చేశారు. కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడం, వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉండటంతో ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకొంది.