Shaakuntalam Day 1 Collection: శాకుంత‌లం మూవీకి షాకింగ్ క‌లెక్ష‌న్స్ - స‌మంత సినిమా ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేసిందంటే-samantha shaakuntalam movie day 1 collection worldwide area wise details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam Day 1 Collection: శాకుంత‌లం మూవీకి షాకింగ్ క‌లెక్ష‌న్స్ - స‌మంత సినిమా ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేసిందంటే

Shaakuntalam Day 1 Collection: శాకుంత‌లం మూవీకి షాకింగ్ క‌లెక్ష‌న్స్ - స‌మంత సినిమా ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేసిందంటే

Nelki Naresh Kumar HT Telugu
Apr 15, 2023 01:07 PM IST

Shaakuntalam Day 1 Collection: స‌మంత శాకుంత‌లం సినిమా శుక్ర‌వారం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. ఈ పౌరాణిక సినిమాకు తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే....

స‌మంత
స‌మంత

Shaakuntalam Day 1 Collection: స‌మంత (Samantha) శాకుంత‌లం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ప‌రంగా ద‌ర్శ‌క‌నిర్మాతల‌కు భారీ షాక్ ఇచ్చింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోటి ప‌ది ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మొద‌టిరోజు నాలుగున్న‌ర కోట్ల గ్రాస్‌ను, రెండు కోట్ల ప‌దిహేను ల‌క్ష‌ల షేర్‌ను ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ మైథ‌లాజిక‌ల్ మూవీకి రెండు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు గ్రాస్‌, కోటి ప‌ది ల‌క్ష‌ల షేర్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. నైజాం మిన‌హా మిగిలిన చోట్ల శాకుంత‌లం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. స‌మంత గ‌త సినిమా య‌శోద (Yashoda) తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆరున్న‌ర కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా య‌శోద సినిమా ద‌రిదాపుల్లోకి కూడా శాకుంత‌లం రాకపోవడం గ‌మ‌నార్హం.

శాకుంత‌లం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 18 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు చెబుతోన్నారు. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ చూస్తుంటే ఈ సినిమా నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి. క‌థ‌లో బ‌ల‌మైన ఎమోష‌న్స్ లేక‌పోవ‌డం, స‌మంత‌, దేవ్‌మోహ‌న్ యాక్టింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్‌పైన భారీగా విమ‌ర్శ‌లు వినిపించాయి.

ఈ నెగెటివ్ కామెంట్స్ ఎఫెక్ట్స్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌పై భారీగా ప‌డ్డ‌ట్లు స‌మాచారం. అందువ‌ల్లే సినిమా ఇంత త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. రెండో రోజు క‌లెక్ష‌న్స్ మ‌రింత తగ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తోన్నారు.

మ‌హాక‌వి కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ (Gunashekar) శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో శ‌కుంత‌ల‌గా టైటిల్ పాత్ర‌లో స‌మంత న‌టించ‌గా దుష్యంతుడి పాత్ర‌ను మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహ‌న్ పోషించారు. మోహ‌న్‌బాబు, అన‌న్య నాగ‌ళ్ల‌, స‌చిన్ ఖేడ్క‌ర్‌, గౌత‌మి, మ‌ధుబాల కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

IPL_Entry_Point