Vijay Deverakonda on Samantha: సామ్.. నువ్వో ఫైటర్: ఖుషీ కోస్టార్‌కు విజయ్ మెసేజ్-vijay deverakonda on samantha says she is a fighter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda On Samantha: సామ్.. నువ్వో ఫైటర్: ఖుషీ కోస్టార్‌కు విజయ్ మెసేజ్

Vijay Deverakonda on Samantha: సామ్.. నువ్వో ఫైటర్: ఖుషీ కోస్టార్‌కు విజయ్ మెసేజ్

Hari Prasad S HT Telugu
Apr 13, 2023 09:16 PM IST

Vijay Deverakonda on Samantha: సామ్.. నువ్వో ఫైటర్ అంటూ తన ఖుషీ మూవీ కోస్టార్‌కు విజయ్ మెసేజ్ చేశాడు. శాకుంతలం రిలీజ్ కు ఒక రోజు ముందు ట్విటర్ ద్వారా సమంతకు అతడు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.

విజయ్ దేవరకొండ, సమంత
విజయ్ దేవరకొండ, సమంత (twitter)

Vijay Deverakonda on Samantha: సమంత నటించిన శాకుంతలం మూవీ శుక్రవారం (ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా తన ఖుషీ మూవీ కోస్టార్ అయిన సామ్‌కు విజయ్ దేవరకొండ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అంతేకాదు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు.

గురువారం (ఏప్రిల్ 13) విజయ్ ఓ ట్వీట్ చేశాడు. అందులో సమంత కోసం ఓ లాంగ్ నోట్ రాశాడు. ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనసుకు హత్తుకునేలా విజయ్ ఈ మెసేజ్ రాశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఖుషీ అనే రొమాంటిక్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజా ట్వీట్ లో సమంత ఓ ఫైటర్ అని విజయ్ అన్నాడు.

"సామీ.. నువ్వు ప్రేమకు నిలువెత్తు రూపం. ఎప్పుడూ మంచే చేయాలని అనుకుంటావ్. సంతోషం పంచాలని అనుకుంటావ్. ప్రతి సీన్ ను నీ కెరీర్ మొత్తం దానిపైనే ఆధారపడినట్లుగా చేస్తావ్. గతేడాది కాలంగా నువ్వు ఎలాంటి ఫైటర్ వో ఈ ప్రపంచం చూసి ఉండకపోవచ్చు. నీ శరీరానికి విశ్రాంతి అవసరమైనా ఎప్పుడూ నీ సినిమాలకు, అభిమానులకు నవ్వుతూనే కనిపిస్తావ్ " అంటూ విజయ్ ట్వీట్ చేశాడు.

అంతేకాదు శుక్రవారం (ఏప్రిల్ 14) రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమాకు బెస్ట్ విషెస్ చెప్పాడు. గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న శాకుంతలం మూవీ.. భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా త్రీడీలోనూ రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకూ మూవీ ప్రీమియర్స్ కు మాత్రం కాస్త నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడమే మేకర్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది. శకుంతలగా సమంత ఈ మూవీలో ఎలా చేసిందన్నది మూవీ రిలీజైన తర్వాతే తెలుస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం