Kushi Release Date: విజయ్, సమంత ఖుషీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్-kushi release date announced by the makers on thursday march 23rd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi Release Date: విజయ్, సమంత ఖుషీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Kushi Release Date: విజయ్, సమంత ఖుషీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Hari Prasad S HT Telugu
Mar 23, 2023 04:04 PM IST

Kushi Release Date: విజయ్, సమంత ఖుషీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ లవ్ స్టోరీ షూటింగ్ ఈ మధ్యే మరోసారి ప్రారంభం కాగా.. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు.

ఖుషీ మూవీలో విజయ్, సమంత
ఖుషీ మూవీలో విజయ్, సమంత

Kushi Release Date: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో ఆసక్తి రేపుతున్న పాన్ ఇండియా మూవీ ఖుషీ. విజయ్ దేవరకొండ, సమంతలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. సమంత అనారోగ్యం కారణంగా చాలా కాలం ఆలస్యమైన ఈ మూవీ షూటింగ్.. ఈ మధ్యే తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే.

అయితే తాజాగా గురువారం (మార్చి 23) ఖుషీ మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ ఖుషీ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ మంచి పోస్టర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ రెండు ప్రపంచాలు సెప్టెంబర్ 1న కలుస్తాయంటూ ఖుషీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్, సమంత మధ్య మంచి కెమెస్ట్రీ కనిపిస్తోంది. చేతిలో క్యారేజీ పట్టుకొని ఆఫీసుకు వెళ్తున్న విజయ్ కి సమంత బాయ్ చెబుతున్న పోస్టర్ ఇది. ఈ లవ్ డ్రామాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

ఈ సినిమా రిలీజ్ కు మరో ఐదు నెలల సమయం ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండటంతో త్వరలోనే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టనున్నారు. లైగర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి ఈ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక త్వరలోనే శాకుంతలం మూవీతో అలరించనున్న సామ్.. ఆ తర్వాత ఖుషీలో విజయ్ తో రొమాన్స్ చేస్తూ కనిపించనుంది.

ఖుషీ మేకర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ తోపాటు విజయ్, సమంత కూడా ఈ రిలీజ్ డేట్ ను తమ అధికారిక ట్విటర్ అకౌంట్లలో షేర్ చేసుకున్నారు.

సంబంధిత కథనం