Kushi Movie Update: నార్వే షిఫ్ట్ అవుతున్న సామ్-విజయ్.. ఖుషీ షూట్ పునఃప్రారంభం!
Kushi Movie Update: టాలీవుడ్ రౌడీ హీరో, సమంత కాంబోలో ఖుషీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం నార్వేకు బయల్దేరిందట చిత్రబృందం. మార్చి మొదటి వారం నుంచి సామ్ కూడా చిత్రీకరణలో పాల్గొంటుందట.
Kushi Movie Update: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజులుగా సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన ఆమె ఇటీవలే దాన్నుంచి కోలుకుని తిరిగి షూటింగులతో బిజీ అవుతోంది. ఇందుకోసం జిమ్‌లో కసరత్తులు కూడా ప్రారంభించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగా బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ వరుణ్ ధావన్ సరసన సిటడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్ కోసం డేట్స్ కూడా ఇచ్చింది. అయితే తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషీ అనే సినిమా కూడా చేస్తుండగా.. దీనికి మాత్రం ఇంకా డేట్స్ ఇవ్వలేదు. తాజాగా ఖుషీ సినిమాకు సంబందించి అప్డేట్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
సామ్.. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషీ షూటింగ్ త్వరలోనే పునఃప్రారంభంకాబోతుందట. ఈ మేరకు మార్చి మొదటి వారం నుంచి సమంత చిత్రీకరణలో పాల్గొనబోతుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ సినిమా మెజార్టీ భాగం కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందట. ఇప్పటికే అక్కడ వివిధ రకలా లోకేషన్లలో చిత్రీకరణ జరిపారు. క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అందమైన మంచు మధ్యలో చిత్రీకరించేందుకు టీమ్ లోకేషన్ కోసం జల్లెడపడుతున్న తరుణంలో కశ్మీర్‌ను ఎంచుకుంది.
అయితే సమంత కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో రాబోయే వేసవిలో కశ్మీర్‌లో మంచు పెద్దగా కనిపించదు. దీంతో మంచు కశ్మీర్‌లోని ప్రాంతాలకు సరిపోయే విధంగా ఖుషీ టీమ్ నార్వేకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ హీరో, హీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ విధంగా నార్వేలో కశ్మీర్‌ను పునఃసృష్టించనున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, జయరామ్, సచిన్ ఖేడ్కర్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళ భాషల్లో ఈ చిత్రం విడుదల చేయనున్నారు.