Kushi Movie Update: విజయ్-సామ్ ఖుషీ అప్డేట్ ఇదిగో.. ఫైట్స్‌తో షెడ్యూల్ షురూ-director siva nirvana gives update on viay deverakonda and samantha starred kushi movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Siva Nirvana Gives Update On Viay Deverakonda And Samantha Starred Kushi Movie

Kushi Movie Update: విజయ్-సామ్ ఖుషీ అప్డేట్ ఇదిగో.. ఫైట్స్‌తో షెడ్యూల్ షురూ

Maragani Govardhan HT Telugu
Mar 05, 2023 06:47 PM IST

Kushi Movie Update: విజయ్ దేవరకొండ-సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమాకు పోరాటాలను పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తున్నాడట. అంతేకాకుండా ఈ నెల 8 నుంచి సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని సమాచారం.

విజయ్ దేవరకొండ-సమంత
విజయ్ దేవరకొండ-సమంత

Kushi Movie Update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్న చిత్రం ఖుషీ. ఈ సినిమా ఎప్పుడో పూర్తయి విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవతూ వచ్చింది. ఇంతలో సమంత అనారోగ్యానికి గురికావడంతో ఆ ఆలస్యం మరింత పెరిగింది. ఇటీవలే సామ్ కోలుకుని షూటింగ్‌లో తిరిగి పాల్గొంంటున్నట్లు పేర్కొనడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

యాక్షన్ సీక్వెన్స్‌తో ఖుషీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్‌ కోసం ప్రముఖ ఫైట్ మాస్టార్ పీటర్ హెయిన్స్‌తో పోరాటాలు చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పీటర్, ఎడిటర్ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు డైరెక్టర్ శివనిర్వాణ. ఈ నెల 8 నుంచి కొత్తషెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, జయరామ్, సచిన్ ఖేడ్కర్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత తొలి సారిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

. ఈ సినిమా మెజార్టీ భాగం కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందట. ఇప్పటికే అక్కడ వివిధ రకలా లోకేషన్లలో చిత్రీకరణ జరిపారు. వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి ఈ వెసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముదుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందట.

IPL_Entry_Point