Samantha: అయ్యో.. మళ్లీ మంచాన పడిన సమంత.. అసలేమైంది?-samantha ruth prabhu down with fever and lost her voice ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: అయ్యో.. మళ్లీ మంచాన పడిన సమంత.. అసలేమైంది?

Samantha: అయ్యో.. మళ్లీ మంచాన పడిన సమంత.. అసలేమైంది?

Hari Prasad S HT Telugu
Apr 12, 2023 04:45 PM IST

Samantha: అయ్యో.. మళ్లీ మంచాన పడింది సమంత.. అసలు ఆమెకు ఏమైంది? ఆ మధ్య మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు చెప్పిన సామ్.. ఇప్పుడు తన శాకుంతలం మూవీ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉన్నా.. ఇంటికే పరిమితమైంది.

సమంత
సమంత

Samantha: సమంత రుత్ ప్రభు.. ఈమధ్య ముఖంలో కళ కోల్పోయింది. ఆ మధ్య తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పిన విషయం తెలిసిందే. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ చికిత్స వల్లో, ఆ వ్యాధి వల్లో కానీ ఆమె ముఖంలో మునుపటి గ్లో కనిపించడం లేదు. ఇదే విషయం ఓ అభిమాని చెబితే.. ఆమె కాస్త అసహనం వ్యక్తం చేసింది.

ఇక ఇప్పుడు ఆమె మరోసారి మంచాన పడింది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 14) సమంత నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలోనే సామ్ కొన్ని రోజులుగా బిజీగా గడిపింది. అయితే ఇప్పుడు మాత్రం సడెన్ గా ఆమె ఈ ప్రమోషన్లకు దూరమైంది. అసలు ఆమె ఈ ప్రమోషన్లకు ఎందుకు రావడం లేదని అనుకుంటున్నలోపే సమంతే ట్విటర్ ద్వారా అసలు విషయం చెప్పింది.

బిజీ షెడ్యూల్ కారణంగా తనకు జ్వరం వచ్చినట్లు ఆమె బుధవారం (ఏప్రిల్ 12) ట్వీట్ చేసింది. "ఈ వారం మొత్తం నా సినిమాను ప్రమోట్ చేస్తూ, మీ మధ్యే ఉంటూ మీ ప్రేమను పొందాలని అనుకున్నాను. దురదృష్టవశాత్తూ బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ వల్ల నేను జ్వరంతో మంచాన పడ్డాను. నా వాయిస్ పూర్తిగా పోయింది" అని సమంత ట్వీట్ చేసింది.

సమంత నటించిన శాకుంతలం సినిమా చాలాసార్లు వాయిదా పడిన తర్వాత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో సామ్.. శకుంతలగా నటించింది. గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 3డీలోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం