Samantha on Shaakuntalam: శాకుంతలం గురించి ఎవరికీ తెలియని ఐదు విషయాలు చెప్పిన సమంత
Samantha on Shaakuntalam: శాకుంతలం గురించి ఎవరికీ తెలియని ఐదు విషయాలు చెప్పింది సమంత. ఈ శుక్రవారం (ఏప్రిల్ 14) మూవీ రిలీజ్ కానుండగా.. ఆమె సోమవారం (ఏప్రిల్ 10) ఓ క్యూట్ వీడియోను రిలీజ్ చేసింది.
Samantha on Shaakuntalam: సమంత నటించిన మైథలాజికల్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా.. వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 14) రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో శకుంతలగా సమంత నటించగా.. దుశ్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించాడు. నిజానికి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ సమంత మాత్రం ఈ మూవీకి సంబంధించి ఎవరికీ తెలియని ఐదు విషయాలను తాజాగా వెల్లడించింది.
సోమవారం (ఏప్రిల్ 10) తన ట్విటర్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సామ్.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు గురించి చెప్పింది. ఇవన్నీ శాకుంతలం సెట్లో జరిగినవి. మూవీ ప్రమోషన్లలో భాగంగా సమంత వీటి గురించి చెప్పింది.
సమంత చెప్పిన విషయాలు ఇవే
- సమంతకు పూల ఎలర్జీ ఉందట. ఈ సినిమాలో తాను ధరించిన పూల వల్ల చేతికి మొత్తం ర్యాషెస్ వచ్చాయని, అదొక ఫ్లవర్ టాటూలాగా కనిపించేదని చెప్పింది. ఆరు నెలల పాటు అది అలాగే ఉండిపోయిందని, షూటింగ్ లో కనిపించకుండా ఉండేందుకు దానిపై మేకప్ చేసినట్లు తెలిపింది.
- ఈ సినిమా కోసం సమంత సొంతంగా మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగు, తమిళం, హిందీల్లో తాను డబ్బింగ్ చెప్పానని, ఇలా వేర్వేరు భాషల్లో చెప్పడం చాలా కష్టమైన పని అని చెప్పింది.
- ఇక శాకుంతలం సెట్ లో ఓ కుందేలు సమంతను కరించిందట. కుందేళ్లు అసలు క్యూట్ గా కనిపించలేదని, అవి తనను కరిచాయని ఆమె తనదైన స్టైల్లో క్యూట్ గా చెప్పింది.
-శాకుంతలం కోసం తాను 30 కేజీల బరువున్న లెహెంగా వేసుకున్నట్లు కూడా సమంత వెల్లడించింది. ఇంత బరువున్న లెహెంగాలో నటించడం చాలా కష్టమైందని, చుట్టూ తిరిగినప్పుడల్లా ఆ బరువు భరించలేక తాను ఫ్రేమ్ నుంచి తప్పుకున్నానని, దీంతో కెమెరా మ్యాన్ తో తిట్లు తినాల్సి వచ్చిందనీ చెప్పింది.
- ఇక శాకుంతలం సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని కూడా ఈ సందర్భంగా సమంత వెల్లడించింది.