Shaakuntalam Movie : గుణశేఖర్​పై మహిష్మతి ప్రభావం పడిందా?-bahubali movie impact on shaakuntalam here s some reasons ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam Movie : గుణశేఖర్​పై మహిష్మతి ప్రభావం పడిందా?

Shaakuntalam Movie : గుణశేఖర్​పై మహిష్మతి ప్రభావం పడిందా?

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 04:18 PM IST

Shaakuntalam Trailer Release : స‌మంత శాకుంత‌లం ట్రైల‌ర్‌ విడుదలైంది. విజువల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అయితే కొన్ని సీన్లు చూసిన ప్రేక్షకులు.. గుణశేఖర్ పై మహిష్మతి ప్రభావం పడిందా? అని చర్చించుకుంటున్నారు. దానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు.

శాకుంతలం ట్రైలర్ విడుదల
శాకుంతలం ట్రైలర్ విడుదల

స‌మంత నటించిన శాకుంత‌లం సినిమా ట్రైలర్ విడుదలైంది. మ‌హాభార‌తంలోని శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్రణ‌య‌గాథ ఆధారంగా మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీగా దర్శకుడు గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ట్రైల‌ర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. గుణశేఖర్ గత సినిమాలతోపాటుగా.. బాహుబలి సినిమాను పోల్చి చూస్తున్నారు కొంతమంది.

దర్శకుడు గుణశేఖర్ అనగానే.. మెుదటగా గుర్తొచ్చేది భారీ భారీ సెట్టింగులు. శాకుంతలంలోనూ అవి కనిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదలయ్యాక.. మంచి రెస్పాన్స్ వస్తోంది. సమంత కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఈజీగా నటించేయగలదు. చారిత్రక పాత్ర అయిన శకుంతలగానూ సమంత చక్కగా కనిపిస్తోంది. అయితే గుణశేఖర్ మీద మహిష్మతి.. అదే బాహుబలి ప్రభావం పడినట్టుగా ఉందని.. అంటున్నారు. సమంత మెుదటిసారిగా కనిపించినప్పుడు.. ఆమె ఒంటి మీద నుంచి సీతాకోక చిలుకలు పైకి లేస్తాయి. ఇలానే.. బాహుబలిలోనూ ఉంది. తమన్నా.. ఒంటి మీద నుంచి అలానే సీతాకోక చిలుకలు పైకి ఎగురుతాయి.

ఇక మహిష్మతి సామ్రాజ్యంలాంటి మరోసామ్రాజ్యాన్ని కూడా క్రియేట్ చేసినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మహిష్మతిలాంటి పెద్ద నగరం కనిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఉంది. భరతుడు పాత్రలో ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మెుత్తానికి ట్రైలర్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. గుణశేఖర్ తనదైన మార్క్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా కనపడుతోంది.

ఈ భూమి మీద అమ్మ‌నాన్న‌ల‌కు అక్క‌ర‌లేని తొలి బిడ్డ మేన‌క విశ్వామిత్రుల ప్రేమ‌కు గుర్తుగా ఈ పాప పుట్టింది అనే డైలాగ్‌తో శాకుంత‌లం ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. శ‌కుంతల కార‌ణ జ‌న్మురాలు, ఒక న‌వ నాగ‌రిక చ‌రిత్ర‌కు నాంది ప‌ల‌క‌బోతున్న‌ది అనే డైలాగ్‌తో దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ క‌నిపించాడు.

చెలిక‌త్తెలు శ‌కుంత‌ల‌ కోసం వెతుకుతుండ‌టం, అదే స‌మ‌యంలో దుష్యంతుడు ఆమెను చూసి మైమ‌ర‌చిపోయే సీన్‌తో స‌మంత ను ట్రైల‌ర్‌లో చూపించారు. స్వ‌చ్ఛ‌మైన త‌న ప్రేమ కోసం దుర్వాసుడి ఆగ్ర‌హానికి, క‌శ్య‌ప మ‌హ‌ర్షి అనుగ్రాహానికి మ‌ధ్య ఆమె ప‌డే క‌ష్టాలు భూమాత‌కు సైతం భార‌మే అనే డైలాగ్‌తో స‌మంత ప్రేమ‌కు ఎదుర‌య్యే క‌ష్టాలు చూపించారు.

ఈ సినిమాలో దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నాడు. దుర్వాస మ‌హామునిగా మోహ‌న్ బాబు క‌నిపించారు. గౌత‌మి, సుబ్బరాజుతో పాటు ప‌లువురు టాలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్రల్ని పోషించారు. ఫిబ్రవరి 17న ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు బాలీవుడ్‌లో శాకుంత‌లం సినిమా రిలీజ్ కానుంది. త్రీడీలో ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్నారు.