Samantha: ఊ అంటావా పాట చేస్తే తప్పేంటి.. నా పెళ్లితో దీనికి ఏంటి సంబంధం: సమంత-samantha says she did not do any crime by doing oo antava song
Telugu News  /  Entertainment  /  Samantha Says She Did Not Do Any Crime By Doing Oo Antava Song
ఊ అంటావా పాటలో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన సమంత
ఊ అంటావా పాటలో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన సమంత (Instagram )

Samantha: ఊ అంటావా పాట చేస్తే తప్పేంటి.. నా పెళ్లితో దీనికి ఏంటి సంబంధం: సమంత

29 March 2023, 15:50 ISTHari Prasad S
29 March 2023, 15:50 IST

Samantha: ఊ అంటావా పాట చేస్తే తప్పేంటి.. నా పెళ్లితో దీనికి ఏంటి సంబంధం అని అడుగుతోంది సమంత. ఆ పాట చేయొద్దని తనకు చాలా మంది చెప్పారని, కానీ తానేమీ తప్పు చేయలేదని ఆమె అనడం విశేషం.

Samantha: సమంత చేసిన ఐటెమ్ నంబర్ ఊ అంటావా ఎంతగా ఊపేసిందో మనకు తెలుసు. అయితే టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంతలాంటి నటి ఇలాంటి ఐటెమ్ సాంగ్ చేయడమేంటని చాలా మంది అన్నారు. ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. పెళ్లి చేసుకున్న నటి.. అందులోనూ అక్కినేని ఇంటి కోడలు మరీ ఇలా రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం బాగా లేదనీ అన్నారు.

అంతేకాదు ఆ పాట చేసే సమయానికి నాగ చైతన్యతో సమంత బంధం తెగిపోయే స్థితికి వచ్చింది. ఓవైపు ఆ పాటలో ఆమె చేసిన డ్యాన్స్ కు మంచి మార్కులే వచ్చినా.. మరీ ఐటెమ్ సాంగ్ చేసే స్థాయికి దిగజారడం ఏంటన్న ప్రశ్నలూ వచ్చాయి. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లోనూ కొన్ని బోల్డ్ సీన్స్ లో సమంత నటించింది. అయితే మొత్తానికి ఇన్నాళ్లకు ఊ అంటావా మావా పాటపై ఆమె స్పందించాడు.

ఆ పాట చేస్తే తప్పేంటి.. తాను చేసిన నేరమేంటి అని సమంత ప్రశ్నిస్తోంది. అంతేకాదు పెళ్లి విషయంలో తాను 100 శాతం నిజాయతీగా ఉన్నట్లు కూడా చెప్పింది. "నేనే తప్పూ చేయలేదు. నేను పెళ్లి విషయంలో 100 శాతం నిజాయతీగా ఉన్నాను. కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. నేనేమీ నేరం చేయలేదు. ఇంట్లో కూర్చోవడానికో లేదంటే తప్పు చేశానని ఫీలవుతూ నన్ను నేను నిందించుకోవాల్సిన అవసరం లేదు. నేనెప్పుడూ ఐటెమ్ సాంగ్ చేయలేదు. నాకు లిరిక్స్ నచ్చాయి. చాలా మంది వద్దని చెబుతున్నా అందుకే ఆ పాట చేశాను" అని సమంత చెప్పింది.

ఈ పాట చేస్తానంటే తన బంధువులు, స్నేహితులు వద్దని చెప్పారని సమంత వెల్లడించింది. చైతూతో సమంత విడిపోయి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. విడాకుల విషయంలో చాలా మంది తననే నిందించినా.. సమంత మాత్రం ఎప్పుడూ తనను ట్రోల్ చేస్తున్న వారిపై మాట మాట్లాడలేదు. విడాకుల తర్వాత కూడా స్వేచ్ఛగా తిరుగుతూ సినిమాలు చేస్తూ గడుపుతోంది. మరికొద్ది రోజుల్లోనే శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత కథనం