Myositis। సమంతకు సోకిన మైయోసైటిస్‌ వ్యాధికి కారణాలు ఇవే.. లక్షణాలు, చికిత్స ఇలా ఉంటాయి!-samantha suffers from myositis know symptoms causes and treatment for this autoimmune condition ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Myositis। సమంతకు సోకిన మైయోసైటిస్‌ వ్యాధికి కారణాలు ఇవే.. లక్షణాలు, చికిత్స ఇలా ఉంటాయి!

Myositis। సమంతకు సోకిన మైయోసైటిస్‌ వ్యాధికి కారణాలు ఇవే.. లక్షణాలు, చికిత్స ఇలా ఉంటాయి!

Manda Vikas HT Telugu
Oct 31, 2022 08:09 PM IST

Samantha- Myositis: నటి సమంత మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి రావటానికి కారణాలు, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స విధానం ఇక్కడ తెలుసుకోండి.

Samantha- Myositis
Samantha- Myositis

Samantha- Myositis: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మైయోసిటిస్ అనే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. అందులో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

అయితే అసలు ఏమిటీ మయోసిటిస్ వ్యాధి? అనే దానిపైన ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ అనారోగ్య పరిస్థితికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వ్యాధి రావటానికి కారణలేమి, దీనికి చికిత్స ఉందా మొదలైన అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

What is Myositis - మయోసిటిస్ అంటే ఏమిటి?

మైయోసిటిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి (Auto-Immune Condition). ఈ పరిస్థితిలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన స్వంత కణజాలాలపైనే పొరపాటుగా దాడి చేస్తుంది. ఫలితంగా కండరాలలో వాపు, బలహీనత, దద్దుర్లను కలిగిస్తుంది. ఇది బాధాకరమైన మంట, నొప్పికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది.

Myositis- Symptoms- మైయోసైటిస్‌ లక్షణాలు

కండరాల బలహీనత మయోసిటిస్ వ్యాధి ప్రధాన లక్షణం. అలసట, కూర్చోవడంలో ఇబ్బంది, మింగడంలో అసౌకర్యం, డిప్రెషన్ వంటివి ఇతర లక్షణాలు.

ప్రారంభ దశలో వ్యక్తికి నడవడం కూడా కష్టంగా ఉంటుంది. మంచంలో పడుకున్నపుడు మరో పక్కకు తిరగాలన్నా నొప్పి ఉంటుంది. కూర్చున్న స్థానం నుంచి లేవలేరు, లేస్తే కూర్చోలేరు అన్నంత కష్టంగా ఉంటుంది. మెట్లు ఎక్కడం, జుట్టు దువ్వడం, వస్తువులను ఎత్తడం వంటి రోజువారీ పనులను చేసుకోవడం కూడా కష్టంగా మారవచ్చు.

సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది శరీరంలోని ఇతర కండరాలకు పాకుతుంది. శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి, శ్వాస సమస్యలకు దారితీస్తుంది.

What Causes Myositis- మయోసైటిస్‌కు కారణాలు

  • మయోసిటిస్ సంభవించటానికి వివిధ కారణాలు ఉన్నాయి. చాలా కేసులకు కారణం లేదు. కొన్నిసార్లు గాయం లేదా సంక్రమణ ఫలితంగా తలెత్తవచ్చు. డ్రగ్ టాక్సిసిటీ, జలుబు, ఫ్లూ లేదా హెచ్‌ఐవి వంటి వైరస్‌లు కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులు కారకం కావొచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
  • సాధారణంగా దగ్గు, జలుబుతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కొన్ని రకాల మైయోసైటిస్‌కు కారణమవుతుంది.
  • బ్యాక్టీరియా, వైరస్, ఇతర పరాన్నజీవులు శరీరంపై దాడి చేసినపుడు కలిగే ఇన్ఫెక్షన్ మయోసైటిస్‌కు దారితీస్తుంది.
  • కొన్ని కార్డియోవాస్కులర్ మందులు కండరాల మయోసైటిస్‌ను ప్రేరేపించగలవు
  • శరీర సామర్థ్యానికి మించి ఆల్కహాల్, కొకైన్ వంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ పరిస్థితిని సంభవిస్తుంది.

Myositis Treatment - మయోసైటిస్‌కు చికిత్స

మయోసిటిస్ చికిత్స రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సను పోలి ఉంటుంది. లక్షణాలను నయం చేయటానికి వైద్యులు తగిన మందులను అందిస్తారు. ఫిజియోథెరపీ, ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ, స్టెరాయిడ్స్‌తో చికిత్స, DMARDలు మొదలైన అన్ని రకాల చికిత్సలు ఉన్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పైన పేర్కొన్న కారకాలను తగ్గించుకోవాలి.

సమంత కోలుకోవడం గురించి నమ్మకంగా ఉందని వైద్యులు హామీ ఇచ్చారు. తన పరిస్థితి గురించి చెబుతూ 'ఇది కూడా దాటిపోతుంది' (This Shall Too Pass). అని రాసింది. అదే జరగాలని, త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం